Thursday, March 15, 2018


ఆమనగల్లులో ఒక గుడి-రెండు శాసనాలు

          నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోనిది ఆమనగల్లు గ్రామం.ఆమనగల్లు పురాతనపట్టణం.రేచర్ల రెడ్డి వంశీయులకు జన్మస్థానం.వారికిది తొలి రాజధాని.ఇక్కడ ఇప్పటికీ ఈ రాజవంశీయులు నిర్మించిన ఓ పురాతన కోట ఆనవాళ్ళున్నాయి.శాసనాలలో ‘ఆమనగంటిపురవరాధీశ్వర’ బిరుదులతో రాజులెందరో కీర్తింపబడ్డారు.ఈవూరు ఒకప్పుడు దండుబాటలకూడలి.వ్యాపారకేంద్రం.పానుగల్లుతో,పిల్లలమర్రితో దగ్గరిసంబంధాలున్న పట్టణం.
          ఈవూళ్ళోవున్న చిన్నబోడుమీద రామలింగేశ్వరదేవాలయం వుంది.గుడికివెళ్ళే మెట్లదారికిరువైపుల నిలబెట్టివున్న ద్వారపాలకుల విగ్రహాలు రెండురకాలుగావున్నాయి.రెండు వైష్ణవద్వారపాలకుల స్తంభాలశిథిలాలు, మరొకటి శైవమనిపించే లగుడధారి ద్వారపాలకుని శిల్పస్తంభపుముక్క.గుట్టమెట్లెక్కి పైకి చేరగానే కిటికీజాలివంటి చెక్కడంలో మహిషాసురమర్దని అద్భుతశిల్పం కనిపిస్తుంది.దేవాలయానికి కొన్నిశిల్పాలు అబ్బురపరిచేవిధంగా వున్నాయి.ఆ శిల్పాలలో మూడడుగుల ఎత్తున్న మరొక మహిషాసురమర్దని,అదే ఎత్తులో వినాయకుడు,జోడు అమ్మదేవతలు (కాకతమ్మకు సైదోడు ఏకవీరలా?),భయంకరమైన ముఖంతో,పెద్దచెవులతో,కుడిచేయి తొడకానించి, ఎడమచేతిలో తాళపత్రగ్రంథంతో వున్న పద్మాసనామూర్తి జ్యేష్టాదేవితో పోలిన దేవతావిగ్రహం, ఒకవీరగల్లు(కాని,వీరుని ఆహార్యంలో రాజసం వుంది),వల్లీసమేత సుబ్రహ్మణ్యుడు,అన్నిటికన్నా మిన్న,మూడుతలలు,రెండు చేతులలో అక్షమాల, పానపాత్రలతో దేశంలోనే అతితక్కువగా వున్న అరుదైన బ్రహ్మ(7వ శ.నాటిది)విగ్రహం,తలసగంవిరిగిన రాజశిల్పం,చాళుక్యుల నాటి నంది విగ్రహాలు ప్రత్యేకం ఇక్కడ.
          దేవాలయపు గోడలపై ద్వారపాలకులు చతుర్భుజులు.వారిలో ఒకరు చక్రం,శంఖం,లగుడం లేదా గదాధరుడు, మరొకడు చక్రం,సర్పం,లగుడం లేదా గదాధరుడు.చిత్రమైన కలయిక. దేవాలయ ప్రవేశ ద్వారాని కిరువైపుల ఏనుగుల శిల్పాల రెయిలింగు.దేవాలయపు చూరుకు(ప్రస్తరానికి)హంసలపట్టికలు,దేవాలయపు అంతరాళంలో స్తంభాలు నాలుగు న్నాయి.రాష్ట్రకూటశైలి.గర్భగుడి లలాటబింబంగా గజలక్ష్మివుండడం పశ్చిమ చాళుక్యుల సంప్రదాయమే.కాని,ఇక్కడ గజలక్ష్మితోపాటు రెండువైపుల వెనకకాళ్ళపై నిలుచున్న రెండు సింహాలు,వాటి వెనక రెండు ఏనుగులుండడం ప్రత్యేకత. గర్భగుడిద్వారపు ఉత్తరాశి ఇట్లా వుంటే,ద్వారబంధాలపై రెండువైపుల ఇద్దరు స్త్రీమూర్తుల ద్వారపాలికలశిల్పాలు జోగులాంబ పోలికలతో వుండడం ఆలంపురంలోని బ్రహ్మేశ్వరాలయపు ద్వారబంధాలపై వున్న చండిక,ముండికలను గుర్తుతెస్తున్నాయి.‘ఆలంపురం శిథిలములు’ లో గడియారం రామకృష్ణశర్మగారు బ్రహ్మేశ్వరాలయ గర్భాలయంలో తొలుత స్త్రీమూర్తి(జోగులాంబ)వుండివుండేదని చెప్పవచ్చన్నారు.ఆమాటే ఇక్కడకూడా వర్తిస్తుంది. పూర్వమీ గుడి శక్త్యాలయమే అయివుండాలి.ఈ దేవాలయద్వారబంధానికి పైన కప్పుకు కిందుగావున్న శిల్పం మరొక విస్మయాత్మకం.ఆశ్చర్యాత్మకం.నందిపై ఆసీనుడైన చతుర్భుజమూర్తి వెనకవైపు రెండుచేతులలోశంఖు,చక్రాలు.ముందు కుడిచేతిలో లగుడం,ఎడమచేతిలో ఫలం లేదా పాత్ర వుండడం...ఆమూర్తికిరువైపుల కాపాలికులు పరివేష్టించివుండడం శైవమతస్ఫూర్తే అయినప్పటికి,ఈశ్వరుని చేతిలో శంఖు,చక్రాలేమిటన్నదే ప్రశ్న.గర్భగుడిలో పానవట్టంపై వున్న శివలింగం విరిగిన పాలరాయిపలకపై లింగాకృతి చెక్కినరూపం.గర్భగుడి బయట మరొకలింగం,నంది వున్నాయి.ఈ ఒక్కగుడిలో ఇన్ని ఆరాధనారూపాలుండడం చారిత్రకపరిణామాల సాక్ష్యాలుగానే తోస్తున్నది.ఒకప్పటి శక్త్యాలయం విష్ణ్వాలయంగా,చివరిగా శివాలయంగా మార్చబడినట్లుంది.ఎన్నోసార్లు పునరుద్ధరింపబడినట్లుంది.బయటున్న కార్తికేయుడు,బ్రహ్మ,ఇతరదేవతావిగ్రహాలు ఒకప్పుడిక్కడ త్రికూటాలయం వుండేదేమోనన్న భావనకలిగిస్తున్నాయి. దానికి తగినట్లుగా బయటపడివున్న దేవాలయస్తంభాలు,వివిధశిథిలాలు ఇక్కడ మరిన్ని గుళ్ళుండేవని సాక్ష్యమిస్తున్నాయి.
          రామలింగేశ్వరాలయం చూడ్డం విస్మయానందకరమైతే,అక్కడ లభించిన రెండు శాసనాలు తెలంగాణచరిత్రకు కొత్తపుటలు చేర్చే కొత్తశాసనాలు.
          మొదటిది నునుపుచేయనినల్లశానంరాయిపై చెక్కిన 29 పంక్తుల తెలుగులిపి తెలుగుశాసనం.ఈ శాసనంలో రాజవంశం,తేదీలు లేవు.శ్రీమను సద శ్రీరామేశ్వరదేవరకు గుడితూర్పున పెట్టిన వ్రిత్తిని దానం చేసారని శాసనసారాంశం.
కాని,శాసనంలో పేర్కొనబడ్డపేర్లు చరిత్రలో గాలించవలసివస్తున్నది.శాసనంలోని 4,5,6 పంక్తులలో పేర్కొన్న మణినాగపురవరేశ్వరుడెవరు?వరంగల్ జిల్లా శాసనాలలో 21వది,మేడపల్లి శాసనం(పేజి సం.50-55)లోని 16,17వ పంక్తులలో ‘(మేడ)భూప మణినాగపురాధి(రాజః) శ్రీమాధవాన్వయ సరోవర రా(జహంస)’అని వుంది.దానిని బట్టి ఈ శాసనం వేయించినది మాధవర్మప్రతాపులైన శ్రీమనుమహామండలేశ్వర కొండమల్లిదేవరాజులు కూడా మణినాగపుర వరాధీశ్వరునితో సంబంధమున్నవాడే.అటు మేడరాజు మాధవాన్వయ సరోవరరాజహంస,ఇటు కొండమల్లిదేవరాజులు మాధ(వ)వర్మ ప్రతాపులు.ఇంతకీ కొండమల్లి దేవరాజులు ఎవరు?కొండమల్లి కొండపల్లి అయితే సూర్యాపేటకు చేరువగావున్న సిరికొండే కొండపల్లి అని చరిత్రలో వుంది.ఈ దేవరాజులు లేదా కొండమల్లిదేవరాజులు చరిత్ర ప్రసిద్ధుడు కాడు.కాని,తుమ్మల వేంకటేశ్వర్రావుగారు రాసిన ‘ముసునూరి ప్రభువులు’అనే చరిత్రపుస్తకంలోని 77వ పేజిలో క్రీ.శ.1361లో సింగమనాయకుని కుమారులు అనపోతానాయడు,మాదానాయడు జల్లిపల్లికోటకొరకు(ఇనుగుర్తి వద్ద)చేసిన యుద్ధంలో 101 మంది చాళుక్యరాజులను చంపి వారిరక్తంతో తండ్రికి తిలోదకాలిచ్చారట.ఆయుద్ధంలో మరణించిన చాళుక్యరాజులలో ఒకరు కొండమల్రాజు అని రాయబడివుంది.ఈ కొండమల్లి దేవరాజులే కొండమల్రాజు అవడానికి అవకాశముంది.శాసనభాష,శాసనలిపి రెండవ ప్రతాపరుద్రుని కాలంనాటిదేనని తెలుస్తున్నది.ప్రతాపరుద్రుని మరణానంతరం కలిగిన పరిణామాలు ప్రోలనాయకుడు,కాపయనాయకుల రాజ్యాలు,యుద్ధాలు చరిత్రలో ప్రసిద్ధాలే.ఇతర ఆధారాలు ఏవైనా కొత్తగా లభిస్తే ఈ చరిత్ర మరింత విస్తరిస్తుంది.ఎవరి సవరణలకైనా ఆహ్వానమే.
          రెండో ఆమనగల్లుశాసనం చరిత్రలో కొత్తమెరుపు.గుట్టమీద ఆలయం పక్కన పడివున్న మరొక శాసనం 10అడుగుల పొడవు,అడుగున్నర మందంతోవున్న గ్రానైటురాయిమీద నాలుగువైపుల 94 పంక్తులలో చెక్కివున్నది. లిపి తెలుగు.భాష తెలుగన్నడం.శాసనం ప్లవంగనామ సం.లో వేయబడింది.రెండవ అకాలవర్షుని పాలనాకాలంలో ఇది క్రీ.శ.888 అవుతుంది.శంకరగండరస కాలంతో సరిచూసినపుడు కూడా ఇదే కాలంతో సరిపోతుంది. శాసనం  స్వస్తి+అకాలవర్షదేవ శ్రీపృథ్వీవల్లభ మహారాజాధిరాజ పరమేశ్వర అంటూ మొదలయింది. ‘తత్పాద పద్మోపసేవి’తుడైన మహాసామాంతాధిపతి ‘జయధీర,భువనైక రామ,అభిమానధవళ, రట్టరమేరు, రాజభూరిశ్రవ, విద్విష్టనారాయణ, ధర్మరత్సాగరం’అనే బిరుదులున్న శంకరగండరస కొల్లిపాక-20,000లనాడు రాజధానిగా పాలిస్తున్నపుడు (ఇదే పేరుతో వున్న శంకరగండరసలు కళ్యాణిచాళుక్యుల కాలంలో అగుపిస్తారు. కనుక రాష్ట్రకూటమహారాజు అకాలవర్షునికి, మహాసామాంతాధిపతి శంకగండరసకు కుదిరే కాలమిదే.ఆమనగల్లులో గోకలార్బగుళు(జైన)బసదికి, ‘దికూటమల్లదే పేఱ దేవుళు’లకు అక్కడి ప్రెగ్గడల ఆనతితో వామదేవయ్యఅనే అధికారి గ్రామగావుండాలతో కలిసి అనేక మర్తురుల పంటభూమిని,వేలాది గద్యలను దానం చేసినట్టు ఈ శాసనంవల్ల తెలుస్తున్నది.
ఈ శాసనం మొదటివైపు పైన దేవాలయగోపురం,ఆవు దూడ,శివలింగం,నంది చెక్కివున్నాయి.మూడోవైపు మేడినాగలి చెక్కివుంది.మేడిగలనాగలి నాటిరైతుసంఘాలసమాఖ్య గుర్తు.దీనినే ‘చిత్రమేళి’ అంటారని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలో వారం వారం ‘చరిత్రశకలాలు’లో రాసిన డా.ఈమని శివనాగిరెడ్డిగారు రాసారు.మూడో కులోత్తుంగ చోళునికాలంలో 1197లో నెల్లూరు రంగనాయకస్వామి దేవాలయంలో వేయబడ్డ శాసనంలో తెలుపబడ్డదని తెలిపారు.అట్లయితే ఆమనగల్లు శాసనం దక్కనులోనే తొలి‘రైతుసంఘాల సమాఖ్య’ను గురించి పేర్కొన్న తొలిశాసనం.
నాగార్జునకొండలో తవ్వకాలలో దొరికిన ఆయకస్తంభాలపై బ్రాహ్మీలపిలో 3వ శ.పు వీరపురుషదత్తుని(6వ విజయసంవత్సరంలో)పేర(ఎపిగ్రాఫియా ఇండికా-XX)రాసివున్న శాసనంలో 4వపంక్తిలో ‘హిరణ కోటి,గో శతసహస, హల శతసహస’అనివుంది.నాగలిప్రసక్తి అప్పటినుండే శాసనాలకెక్కింది.ఇప్పటి ఆలంపురం ఒకప్పటి ‘హలంపురమే’ కదా.లక్ష నాగళ్ళను పంచి వీరపురుషదత్తుడు సాగుచేయడాన్ని  ప్రోత్సహించి చరిత్రలో ఆదర్శంగా నిలిచిపోయాడు. నాగలి ఆనాటినుండి శాసనాలకెక్కింది.నాగళ్ళను గ్రహించిన రైతులు గ్రామ,గ్రామాన రైతుసమాఖ్యలు తప్పక ఏర్పరచుకునివుంటారు.ఆ సాంప్రదాయమే ‘చిత్రమేళి’గా పరిణమించివుంటుంది.
ఆమనగల్లు రేచెర్లరెడ్డి వంశీకుడు డా.రాంస్వరూప్ రెడ్డిగారు చరిత్రప్రియులు.వారి మాటమీద నల్గొండ పురావస్తుశాఖ నల్గొండజిల్లా బాధ్యులు పగడం నాగరాజుగారు,హిందూ రిపోర్టర్ కరుణాకర్ రెడ్డి,మా సహాయకుడు చంటితో కలిసి నేను(కొత్తతెలంగాణచరిత్రబృందం)ఆమనగల్లుకు చేసినయాత్ర అద్భుతమైన చారిత్రకానుభవాన్ని, ఆనందాన్నిచ్చింది.

ఆమనగల్లు, వేములపల్లి మండలం, నల్లగొండ జిల్లా,తెలంగాణ రాష్ట్రం
ఈ శాసనం 94 పంక్తులది.లిపి తెలుగు,భాష కన్నడం.రాజ్యం రాష్ట్రకూట,రాజు అకాలవర్షుడు(రెండవ కృష్ణుడు).కాలం ప్లవంగ నామ సంవత్సరం.క్రీ.శ.888 సం.(ఎణ్డు నూఱఱుపత్తు=810 శక సం.+78 కలిపితే 888 క్రీ.శ.)
మహా సామాన్తాధిపతి, జయధీర, భువనయ్క రామ,అభిమాన ధవళ, రట్టర మేరు, రాజ భూరిశ్రవ,విద్విష్ట నారాయణీం ధర్మరత్సాగరం అని ప్రశస్తిగల  శ్రీమత్సంకర గండరస క్రొళ్ళిపాక-2000నాడు( కొలనుపాక)ను రాజధానిగా పాలించినప్పటి శాసనం.ఆమనగల్లు గుట్ట మీద పూర్వముండే ఆగుర్బుళు జైనబసదికి  వామదేవయ్య తదితర గ్రామ గావుండాలు,ప్రజలు చేసిన భూదాన,ధనదానవివరాలు ఈ శాసనంలో వున్నవి.

ఆమనగల్లు శాసనం:
మొదటివైపుః
గుడిగోపురం,ఆవు-దూడ,శివలింగం,నంది బొమ్మలు
       1.            స్వస్త్యకాలవర్ష దేవ
       2.            శ్రీపృథ్వీవల్లభ మహారా
       3.            జాధిరాజ పరమేశ్వర ప
       4.            రమ భట్టారక ప్రవర్థమా
       5.            న విజయరాజ్యాభివృ
       6.            ద్ధి యుత్తరోత్తర సల్బత్తి
       7.            ర తత్పాదపద్మోప సేవి..
       8.            సమధిగత పంచమహా
       9.            శబ్ద మహా సామాన్తాధి
   10.            పతి జయధీర భువనయ్క
   11.            రామనభిమాన ధవళ ర
   12.            ట్టర మేరు రాజభూరిశ్రవ
   13.            విద్విష్ట నారాయణీం ధర్మ
   14.            రత్సాగరం శ్రీమత్సంకర గండ
   15.            రస క్రొళ్ళిపాకే రాజధాన
   16.            యాగిర్పత్తోఱ్చాసిరనాళు..
   17.            మా దుష్టనిగ్రహ విశిష్ట ప్రతి
   18.            పాలకాది చోరారి దామరాప
రెండోవైపుః
   19.            సర్గంగళం విమర్దే
   20.            సి సుఖ సంకథ
   21.            వినోదంగళినవు
   22.            వఱ్దిన్న మా చన్ద్రార్క
   23.            బరమరసు గేయు
   24.            త్తుమిరే శక భూపా
   25.            ళ సంత్సర శతం గళే
   26.            ణ్డు నూఱఱు వత్తేర..
   27.            దనేయ ప్లవంగ సం
   28.            వత్సరదిం బృహతి
   29.            మకరదోళ్ ప్రవత్తి
   30.            సేఱీమధునాళ పే
   31.            గ్గేళేపన్దుయుం  సేనపీ
   32.            చనప్పణయు మేల్గ
   33.            ణ్డనప్పయు నుత్తరణ
   34.            వామదేవయ్యనాగే
   35.            నాద ప్రజెగె..ళ్ళ
   36.            క్షితినాల్కని....బా
   37.            చదోళ కోరకోణ్డుది
   38.            ..లు ణ్పఱియాదుళే
   39.            ...మం సలిసువగ్గొము
   40.            ...న పరిహారవుత్తిద
   41.            ...జమానమేణ్ణత్తు మా
   42.            ...మ మఱువత్తు కని
   43.            ష్టం నాల్పత్తు మర్తర్నేలనం
   44.            సలిసియుత్తివకెమూ
   45.            ఱు గద్యణం మధ్యమకేర
   46.            దు గద్యణం కనిష్టకేవు
మూడో వైపుః
నాగలి గుర్తు
   47.            ...ళ్వరణం పోన్నకోవ్వ.. ళి
   48.            ఱ్పిణలికి గావున్డి దో..
   49.            న్నోవఱెజమదియనుప
   50.            లివోం భోగపతి గోన్వకేయు
   51.            ల్లదగ్గళం సల్లదు పరివార వ
   52.            రానువుఱ్పోరుళ్దోదే గావుణ్డ
   53.            గోకలాగుఱ్బుళు బిసదికా
   54.            ఱంగే కోరనికిళి పిఱియ
   55.            ఖణ్డుగ దోకూటమల్లదే పే
   56.            ఱ దేవుళుం సల్లదు ఆణె
   57.            మికోదం పియ్దోదం పో
   58.            య్దోదం మూఱుగద్యణ
   59.            సురిగేగిఱ్తీదయ్దు గ
   60.            ద్యణం హిఱెయిఱిదోటో
   61.            దే గాప్పొత్తయ్దు గద్యణం
   62.            సామేమిఱిదోదెల
   63.            య్పత్తు గద్యణం నామన
   64.            నిఱిదోదె నూఱు గద్య
   65.            ణ ళిళర్గణరళవింగే
   66.            ళిన్ద కీర్మదియుమయ్దు
   67.            గద్యణం పొన్ను మంద
   68.            ణ్డం గోళ్వరు ఆవోదో
  69.        ఆయ్వమయుంపిరేదాం శ్రీ
నాలుగొవైపుః
   70.            సంగో...... తేననల్ల
   71.            దోదవృద్ధిదోమాదల
   72.            గనణ్డరేవకోళగా
   73.            ...పరళ్దరికీప్పత్తయ్ద్యు గద్య
   74.            ణం రిఱ్గెలదవగ్గె మూ
   75.            ఱు గద్యణం మినిత కే
   76.            ...వాగాసామిల్లళోం స
   77.            ..ల్లణ్డవేపువోసణ్డద
   78.            మాదేటో సకనాల్వతి
   79.            ఱి దేఱెకోట్వరుగోవ్మమా
   80.            త్యళ మేళాపుతాఱుయుమి
   81.            పసువుం కొట్టిగేఱ్ఱు మల్ల
   82.            పుఱి చకిఱుదేఱేయై
   83.            వుళుం సల్ల పూ
   84.            ..సితియాళోదపన్నసే
   85.            పరిహారమాదువేల్ల
   86.            మప్రవాహదరుహణ
   87.            మకొణ్డుసలిసువదు
   88.            గొన్తిసితియం తప్పద ధనధా
   89.            న్య సన్నిద్దరాగి యాచన్ద్రతారా
   90.            ర్క సుఖహిఱ్విరు బహుభిర్వన్
   91.            సుధానుక్తా రాజనాసగరాది
   92.            భి యస్య యస్య యదాభూమి
   93.            తప్య తస్య తదాఫల సామా
   94.            న్యోయం ధమ్మసేతు నృపాణకా

ఈ శాసనంలో పేర్కొనబడ్డ శంకరగండరస వరంగల్ జిల్లా శాసనసంపుటిలో 3వది,తేదీలేని  ఆకునూరు  శాసనంలో...
‘‘సమధిగత పం/చ మహాశబ్ద మహా/సామాన్తాధిపతి జ/యధీర ఛెవణరజు/అభిమాన ధవళ ర/ట్టశూరరు రాజభూరి(శ్ర)/వ విట్టినారాయణ/ సత్యాణ్నవ ధర్మర/త్సాగర శ్రీమత్సంక(ర) /గణ్డరసరు కొళ్ళి(పా) /కెనాడ రాజ్యాభివృద్ధ/దె ఇప్పత్తిచ్ఛాసిరల/ నాళుత్తిరె ఆకునూర’’ అని...
నల్లగొండ జిల్లా శాసనసంపుటిలో 15వది, తేదీలేని తుమ్మలగూడెం శాసనంలో
‘స్వస్తి స/మధిగత పంచ/మహాశబ్ద మ/హా సామాన్తా/ధిపతి జయ/ధీర భువనయ్క/రామ నభిమాన/ధవళ రట్టర మే/రు రాజభూరిశ్ర/వ విద్విష్టనారా/యణ ధర్మరత్నా/కర శ్రీమత్సంక/ర గణ్డరస జ/యధీర జినాలయక్కె’ అని వుండడం వల్ల ఆమనగల్లు శాసనంతో పోల్చినపుడు శంకరగండరస ప్రశస్తి సమానంగా వుండడం చేత కొలనుపాక-2000నాడును పాలించిన శంకరగండరస మూడింటిలోను ఒక్కరేనని తేలుతున్నది.ఆమనగల్లు శాసనంలో రాజు అకాలవర్షుడు, శాసనకాలం క్రీ.శ.888 వుండడంతో శంకరగండరస కాలం వెల్లడి అయింది.నల్లగొండ జిల్లా శాసనసంపుటిలో తుమ్మలగూడెం శాసనంలో శంకరగణ్డరస కాలాన్ని చెప్పుటకు అవకాశమున్నది.
          ఈ శాసనంపై మొదటివైపు దేవాలయగోపురం,ఆవుదూడలు,శివలింగం,నంది గుర్తులు చెక్కబడివున్నవి. మూడోవైపు ‘నాగలి’ గుర్తు చెక్కబడివుంది.ఇది అరుదైన చిహ్నం.ఈ ఆమనగల్లు శాసనం అపూర్వమైనది.ఈ శాసనంలో ‘చిత్రమేళి’ వుంది.చిత్రమేళి అంటే అందమైన మేడిగల నాగలి అని అర్థమని ఇటీవల డా.ఈమని శివనాగిరెడ్డిగారు చరిత్రశకలాలు-42 (21.02.2016 నాటి ఆదివారం ఆంధ్రజ్యోతి)లో రాసారు.చిత్రమేళి అంటే రైతులసమాఖ్యనట.1197 నవంబరు 21న నెల్లూరులోని రంగనాయకస్వామి దేవాలయంలోని చిత్రమేళి మండపంలో రైతులసభ జరిగినట్లు శాసనంవల్ల విదితమైనట్లు ఆ వ్యాసంలో చెప్పబడ్డది.కాని, ఇక్కడి ఆమనగల్లు శాసనం పైనున్న నాగలిగుర్తు అప్పటికి 309 యేండ్లు పూర్వపుది,ఇప్పటికి 1118 యేండ్ల కిందటనే రైతుల శాసనం వున్నట్లు తెలుపుతున్నదికదా.ఇది తెలంగాణచరిత్రలో అరుదైన సందర్భం.
          (పలుకుబడిలో మేళి మేడిగా మారినట్లుంది.)
On the top of the firstside of the  inscription, we can see a temple gopuram,cow and calf,shivalinga and the nandi, engraved.And on the thirdside top of the inscription stonepillar we find the ‘Plough’ engraved.It is a rare symbol.And this inscription is also a rareone.An Archeologist and a Sthapathi and Former……. Dr. Eemani Shivanagireddy sir wrote an article on ‘Chitrameli’ in his weekly column ‘Charitra Shakalalu-42’ in the Sunday magazine(21.02.2016) of Andhrajyothi telugu daily.He wrote that Plough is a symbol of a federation of farmers.And it is called as ‘Chitrameli’.He found an inscription in the Ranganayaka swami temple at Nellore. it said that on 21st November,1197, there was a meeting held by the farmers’ federation in temple.
                Our Amanagal inscription is more 308 yrs. before than the Nellore inscription. And it is 1118 yrs. old inscription from before present (B.P.)





























No comments:

Post a Comment

చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...