వీరగల్లులు- ఒక స్మరణ
ఒక గొప్ప కారణంకోసం అమరులైన వీరుల స్మృతిలో ప్రాచీనకాలంలో నిలిపిన స్మారకశిలలను వీరగల్లులు అంటారు. ఈ వీరగల్లులు ఎక్కువగా దక్షిణభారతదేశంలోనే కనిపిస్తుంటాయి.
వీరగల్లులు సాధారణంగా ఊరిపొలిమేరలలో కనిపిస్తాయి. ఆ యోధుల కుటుంబీకులు వీరగల్లులకు కుంకుమపెట్టి, పువ్వులతో పూజిస్తారు. శత్రువీరులతో, దొంగలతో పోరి తమ గ్రామాలను, కుటుంబాలను, పసులమందలను కాపాడుకోవడానికి ఏ నిస్వార్థవీరులు అసువులు బాసారో వారి పేరన నిలిపిన శిల్పాలే ఈ వీరగల్లులు.
ఈ వీరగల్లుల శిల్పాలు దేవతావిగ్రహాల కన్న ప్రత్యేకమైనవి. ఈ వీరగల్లులు అమరులైన సాహసయోధుల వీరత్వాన్ని, ఆ పోరాటసందర్భాలను మనముందుంచుతాయి. వీరులు పోరినతీరు, పోరులో వారు వాడిన వాడైన కత్తులు, ఈటెలు, బరిసెలు, పరిఘలు, విల్లమ్ములు, తుపాకులు వంటి ఆయుధాలను, వాళ్ళ వేష, భూషాదులను చూపిస్తాయి వీరగల్లులు. ఈటెలు, కత్తులు, డాళ్ళు,విల్లమ్ములు ధరించి ఏనుగులు, గుర్రాలపై స్వారీ చేసే సైనికవీరులు, వీరకాసెలు పోసి కత్తులతో శత్రువుల మీదికి దూకుతున్న కాలిబంట్లు, కొంత రాచరికపు ఆహార్యంతో ఛత్రం వంటి రాచరికపు హోదా కలిగిన వీరులు వారి, వారి స్థాయీపరమైన భేదాలతో కొన్ని వీరగల్లులలో కనిపిస్తారు. వారి దుస్తులు,సిగలు,నగలు వాళ్ళ కాలపు సంస్కృతిని చూపుతాయి. వారి ఆయుధాలు అప్పటి యుద్ధాల గురించి తెలియజేస్తాయి. కొన్ని వీరగల్లులపై వున్న రాతలు ఆ వీరులపేర్లు, యుద్ధసందర్భాలను తెలిపేవి అయివుంటాయి.
ప్రాచీన తమిళసాహిత్యంలో తమ సమాజాలను,గ్రామాలను రక్షించుకోవడానికి వీరోచితంగా పోరాడి మరణించిన వీరుల స్మృతిలో వేసిన వీరగల్లుల గురించి వర్ణించబడింది. తెలంగాణలో ఆల్వాల్ పల్లి, నందికంది, బమ్మెర, పాముకుంట, యాదగిరిగుట్ట, మరికొన్నిచోట్ల శాసనాలతో వీరగల్లులు లభించాయి. అవన్నీ ఆ వీరులను పేర్లను తలపోసాయి.
ఈ స్మృతిశిలలలో వీరగల్లులు, సతిగల్లులు, వీరశైవభక్తగల్లులు అనే రకాలు ప్రధానమైనవి. వీరగల్లులు ఎక్కువగా గ్రానైట్ రాతిసలపల మీదనే చెక్కుతుంటారు. ఎక్కడోగాని షిస్ట్ శిలలను వాడరు. ఈ వీరగల్లులు రెండడుగుల ఎత్తునుంచి 9,10 అడుగుల ఎత్తు వరకు వుంటాయి.
సాధారణమృత్యువు కారణంగా కాక రాజ్యయుద్ధాల్లోనో, ఆకస్మిక దాడుల్లోనో మరణం పొందిన వీరుల వీరగల్లులతో పాటు చాలాచోట్ల సతిశిలలు కనిపిస్తుంటాయి. భర్తల మరణంతో సతిసహగమనం చేసిన స్త్రీల యాదిలో వేసిన శిలలు సతిశిలలు. ఈ శిలలమీద ఆ స్త్రీమూర్తి గాజుల చేయి కనిపిస్తుంది. సాధారణంగా ఈ చేయి కుడిచేయే వుంటుంది. కొన్నిచోట్ల అరుదుగా ఎడమచేయి కనిపిస్తుంది.

No comments:
Post a Comment