బుజిలాపురం:
ఈ గ్రామం ప్రసిద్ధమైంది. చిన్న గుట్టమీద లక్ష్మీనరసింహస్వామి గుడివుంది. ఒకదానిమీద ఒకటి నిలిచివున్న పరుపుబండలలో కప్పుగా వున్న బండకొక చిన్నరంధ్రమున్నది. అందులోనే నరసింహస్వామి వెలిసాడని విశ్వాసం. 60యేండ్ల కిందట అక్కడి పూజారి ప్రతిశనివారం అర్చన అనంతరం స్వామి ముందు దోసిలిపట్టినపుడు ఆ రంధ్రంనుంచి ఓషధులు అతని దోసిలిలో పడేవట. వాటితో ఆయన ప్రజలకు వైద్యం చేస్తుండేవాడు. ఇక్కడ ప్రతిసంవత్సరం స్వామివారి జయంతి ఉత్సవాలు జరుపుబడతాయి.( బిఎన్ శాస్త్రి - నల్లగొండ మండల సర్వస్వము నుంచి సేకరణ)
యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని గ్రామం బుజిలాపురం. గ్రామంలో వేంకటేశ్వరాలయం వుంది. వూరి బయట లక్ష్మీనరసింహస్వామి దేవాలయముంది. నేను, మా సహాయకుడు చంటి ఈ దేవాలయాన్ని ఇటీవల చూసాం. చిన్నగుట్టమీద పరుపుబండకున్న చిన్న సొరికె(రంధ్రం)లో లక్ష్మీనరసింహస్వామి వెలిసాడని ఇక్కడి ప్రజలవిశ్వాసం. దాదాపు నరసింహులస్వామి వెలిసిన ప్రతిచోట ఇటువంటి కొండగుహలు, సొరికెలు సాధారణం. కట్టిన గుడిలో అర్చామూర్తులు వేరేగా వుంటారు. గుట్టపైకి వెళ్ళడానికి మెట్లున్నాయి. మెట్లు ఎక్కుతున్నపుడు కుడిచేతివైపున్న రాతిగుండుపై పానవట్టసహితంగా చెక్కిన లింగాలు ఆరు కనిపిస్తుంటాయి. అదేగుండుకు చెక్కిన భైరవుని అర్థశిల్పమున్నది. ముందర కొంచెం ఎత్తులో గరుడుడు, హనుమంతుల అర్ధశిల్పాలు చెక్కివున్నాయి. తూర్పు ముఖద్వారంతో లక్ష్మీనరసింహస్వామి దేవాలయముంది. వైష్ణవ ద్వారపాలకులున్నారు. గుడిబయట కూడా వైష్ణవ ద్వారపాలకుల శిల్పఫలకాలున్నాయి. గుడిపునరుద్ధరణ సమయంలో కొత్తవాటిని చెక్కించి వీటిని పక్కన పెట్టినట్లున్నారు. గుడిపక్కన రాతిగుండుకు వినాయకుని శిల్పముంది. అక్కడే కొంతదూరంలో రాతిగుండ్లమీద చెక్కిన పానవట్టసహిత లింగాలున్నాయి. సాధారణంగా శైవమతాచరణలో పాదాల పూజ కనిపించదు. కాని, ఇక్కడ లింగాలపక్కననే సాలంకృత పాదాలు చెక్కి వున్నాయి. రాతి దిమ్మెలు కూడా చెక్కివున్నాయి. నందిశిల్పం రాష్ట్రకూట శైలిలో వుంది. నంది మెడకు, చుట్టు పట్టెడకు పెద్దమువ్వలున్నాయి. నరసింహస్వామి గుడివెనక రాతిగుండ్లతో ఏర్పడ్డ గుహవుంది. ఆ గుహలో నివాసం వున్నట్టు మట్టిగోడల ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి.
లక్ష్మీనరసింహస్వామి గుడివెనక శివాలయం వుంది. శివాలయంలో పానవట్టం పూర్వకాకతీయులశైలిలో భద్రపీఠం పానవట్టంగా వుంది. నందికూడా కాకతీయశైలిలో వుంది. ఈ గుడిలో ఒక మూలన వున్న స్త్రీశిల్పం ప్రత్యేకంగా వుంది. ఆమె చామరధారిణా కాదు, ఆమె కుడిచేతిలో పట్టుకున్నదేమిటో అస్పష్టంగా వుంది. శివాలయం గోపురం ఫంసానశైలిలో వుండి పైన శిఖరకలశం వుంది.
గుడిపైకి మెట్లెక్కడానికి ముందర తూర్పుగా నేలమీద పాదాలు, 5పానవట్టాల మీద జంటలింగాలు వున్నాయి. శిథిలమైన నంది శిల్పం వుంది. జంటలింగాలుండడమే అరుదు. కాని, యిక్కడ అయిదు జంటలింగాలుండడంలో ప్రత్యేకత ఏమైవుంటుందో?
గుట్టకింద హనుమదాలయముంది. దానికి ముందర రెండు ధ్వజస్తంభాలు అగుపిస్తున్నాయి. పడమరగా కూలిన కట్టడాలతో దీర్ఠచతురస్రాకారంలో పాతకొలనుంది. వీటన్నిటికి ఆవల కళ్యాణమంటపం వుంది. దానిపక్కన రాతిబండలతో కట్టిన నాలుగడుగుల ఎత్తున్న చిన్న శివునిగుడి,అందులో లింగంలేదు. పానవట్టం,నంది వున్నాయి.

No comments:
Post a Comment