Sunday, January 26, 2014

మేం నేను, వేముగంటి మురళీకృష్ణ ,దినకర్ నిన్న (22.01.14) మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి (జడ్చర్ల) దగ్గర ఆవంచ వూరవతలపొలాల్లో 26 అడుగుల (ఐశ్వర్య గణపతి) ఏకశిలా విగ్రహం చూసాం

మేం- నేను, వేముగంటి మురళీకృష్ణ , కెఆర్ శర్మ, ఆర్క్యూబ్ నలుగురం రాముతో పాటు ఇవాళ(12.01.2014) వరంగల్ జిల్లా పరకాల దగ్గరలోని రేగొండ ప్రక్కన తిరుమలగిరి గ్రామం పాండవులగుట్టకు వెళ్ళాం. ఈ గుట్టలు అమెరికాలోని కొలరాడొను మరిపంచేంత సౌందర్యంగా వున్నాయి. అవక్షేపశిలల స్తరాలతో కొండలన్ని 1 లక్ష ఎకరాలలో 3 కి.మీ.ల పొడుగున విస్తరించివున్న పాండవులగుట్ట అద్భుతమైన ఆదిమానవుల ఆవాసాలతో నిండిన ప్రాక్చారిత్రక ప్రదేశం. మేం ఆరుచోట్ల ఆదిమానవుల రాతిచిత్రాలను చూశాం. మరికొన్ని చోట్ల ఇట్లాంటి చిత్రాలున్నాయని స్థానికులు చెప్పారు.
ఆ వందలాది చిత్రాలలో పులి,జింకలు, ముళ్ళపంది,చేపలు, సీతాకోకచిలుక,బల్లులు,ఉడుములు, చేతుల గుర్తులు,రేఖాగణితాకృతులు, మనుష్యులు,ఆయుధాలు, మామిడిపండు,గొలుసుకట్టు చిత్రాలు, మరికొన్ని ఆధునికమైన వర్ణాలతో కధాచిత్రాలు(కుంతి కళ్యాణం?) వున్నాయి.మధ్యప్రదేశ్ లోని బింభేట్కాను తలపించడం కాదు మరిపించే రాతిచిత్రాలివి.తెలంగాణ ప్రాక్చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న అపురూపచిత్రాలివి.






















తెలంగాణా చరిత్ర విస్మరణకు గురైంది.
  • అందుకే మనచరిత్రను మనమే రాసుకోవాలి.
  • అందరు తలో పిడికెడు దాచుకోకుండా చరిత్రను అందించండి. 

చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...