Friday, May 4, 2018

కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు, నవపరిశోధకుడు అరవింద్ ఆర్య సందర్శించిన
పాంచాలరాయస్వామి దేవాలయం:
వరంగల్ కు తూర్పుగా 10 కి.మీ.ల దూరంలో శాయంపేట హవేలీ అనే గ్రామం వుంది. అక్కడ కాకతీయులు నిర్మించినారని చెప్పబడే ఈ దేవాలయంలో ఒక గర్భగుడి, అంతరాళం, రంగమంటపం వున్నాయి. ఇక్కడి మూలవిరాట్టు ప్రతిమాలక్షణం ప్రకారం కేశవమూర్తి.మూర్తి ముందు కుడిచేతిలో పుష్పం, వెనకచేతిలో శంఖం, వెనక ఎడమచేతిలో చక్రం, ముందు ఎడమచేతిలో గద వున్నాయి. విగ్రహం తలపై కరండమకుటం వుంది. పాదాలకు కడియాలు, మంజీరాలు, కాలివేళ్ళకు మెట్టెలున్నాయి. తల వెనక పెద్ధ ధమ్మిల్లం(సిగ, కేశపాశము) వుంది. మూర్తిలో స్త్రీ లాలిత్యం వుంది. సర్వాలంకార శోభితుడైన ఈ మూర్తినే పాంచాలరాయుడని పిలుస్తున్నారు. ఇక్కడ అర్చామూర్తి వేణుగోపాలస్వామి. దేశంలో కృష్ణునికి దేవాలయాలెన్నో వున్నాయి. పాంచాలరాయుడని పేరున్న కృష్ణుడు మాత్రం ఎక్కడాలేడు. సోదరి పాంచాలికి మానసంరక్షణ చేసినందుకు కృష్ణునికి పాంచాలరాయుడని పేరు కలిగిందంటారు. పాంచాలరాయుని విగ్రహం నల్లరాతిలో చెక్కిన సుందరశిల్పం. విగ్రహ శీర్షం త్రికోణాకారంలో వుంది. ఊర్ధ్వభాగపు ఈ త్రికోణపు శీర్షం అంచున లోపలివైపు దశావతార మకరవ్యాళీ తోరణం స్వామి తలకు ఇరువైపుల చెక్కబడివుంది.
గర్భగుడి ముందరున్న గరుడుని శిల్పంవెనక ఒకటి, రెండోపక్కన మరొకటి చామరగ్రాహిణుల శిల్పాలున్నాయి. చామరగ్రాహిణుల శిల్పాలు నగ్నసౌందర్యంతో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
ఆలయంలోనికి ప్రవేశించేందుకు రాతిద్వారం వుంది. దేవాలయ గోపురం ద్రావిడశైలిలో వుంది. ధ్వజస్తంభం, పక్కన గణపతి విగ్రహం, హనుమంతుని విగ్రహాలున్నాయి. రంగమంటపంలోను, గర్భగుడిలోను కప్పులో పద్మదళాలు చెక్కివున్నాయి. గర్భాలయం ద్వారానికిరువైపుల పెద్ద కలశాలు, ఉత్తరాశి మీద గజలక్ష్మి లలాటబింబంగా వుంది.
ఈ దేవాలయం కాకతీయుల పతనానంతరం ఢిల్లీ పాలకుల చేతిలో ధ్వంసమైందంటారు.క్రీ.శ. 1503లో షితాబుఖాను(సీతాపతిరాజు) పాంచాలరాయస్వామి గుడిని పునరుద్ధరణ చేసినట్లు షితాబుఖాను శాసనం వల్ల తెలుస్తున్నది.
ఈ గుడిగోడలకు వాడిన రాళ్ళలో ఒకదాని మీద కొత్త శాసనం లభించింది. దీని మీదున్న శాసనాన్ని చదవబోయిన ఏఎస్సై సూపరింటెండెంట్ కన్నబాబు ఇందులోనే ‘నందిధాత’ అనే కొత్త తెలుగుసంవత్సరాన్ని కనుక్కున్నానని పత్రికలతో ప్రకటించాడు. తెలుగు సంవత్సరాలలో చేర్చదగిన కొత్త సంవత్సరం కాదది. ఈ 60 సంవత్సరాల కాలచక్రం ఇపుడపుడే మారే అవకాశాలు లేవు. ఈ శాసనం ‘‘ స్వస్తిశ్రీ శుభ శకవర్షంబులు ...........దగు నెంది ధాత’’ అని మొదలవుతున్నది. కన్నబాబు నెంది ధాతనే నంది ధాతగా భావించి వుంటారు. దట్టంగా సున్నం పట్టివున్న ఈ శాసనాన్ని చదువడం కష్టతరంగా వుంది. సున్నం తొలగించే ఏదైనా సాఫ్టు రిమూవర్ వుంటే ఈ పని సులువయ్యేది.
ఫోటో కర్టెసీః అరవింద్ ఆర్య

























మనదేశాన్ని సందర్శించిన కొందరు విదేశీయుల జాబితా..(గూగుల్ సెర్చ్)
LIST OF FOREIGN TRAVELLERS WHO CAME TO INDIA
1. MEGASTHENES (GREEK) (302-298 BC) :
• Megasthenes was a famous Foreign Envoy and ambassador of Seleucus Nikator of Syria .
• He visited the Chandragupta Maurya (Sandrokottos) court.
• He wrote the great book Indica which explains the reign of Chandragupta Maurya.
• He explained Social and administrative status at the time of Mauryas.
• Megasthenes was the first foreign envoy who visited India. 
2. FA-HIEN (CHINA) (405-411 AD):
Fa-Hien is a Foreign Envoy who visited India at the time of Chandragupta II, known as Vikramaditya.
• He was a Chinese pilgrim. Fa-Hien was the first Chinese pilgrim to visit India.
• Fa-Hien came to India to collect Buddhist texts and relics.
• Fa-Hien visited Lumbini, the Buddha’s birth place.
• He compiled his experiences in a travelogue “Record of Buddhistic Kingdoms”
• 3. HIUEN-TSANG (CHINA) (630-645 AD):
• Hiuen-Tsang is a Foreign Envoy who visited India during the time of Harshavardhana.
• He Reached India through Tashkent and Swat Valley
• He wrote his experiences in his book Si-yu-ki or the ‘Records of Western World . 
4. I-TSING (671-695 AD): 
• I-tsing was A Chinese traveler, I-tsing visited India in connection with Buddhism.
5. AL-MASUDI (957 AD):
Al-Masudi was An Arab traveler, he explained about India in his book Muruj-ul-Zehab.
6. AL-BERUNI (PARSIA) (1024-1030 AD): 
• Al-beruni is a Foreign Envoy who visited India along with Ghazni at the time of his Indian raids.
• Al-beruni is the first muslim scholar who studied Inida.
• He travelled all over India .
• He popularly known as Founder of Indology.
• His famous book was ‘Tahqiq-i-Hind’ which explains about India. 
7. MARCO POLO (1292-1294 AD): 
• Marco Polo was a Foreign Envoy and Venetian traveler
In 1294 A.D. he visited South India.
• Marco Polo visited Rudramadevi’s Kakatiya dynasty.
• He is very popular to travel through number of eastern countries.
• He wrote his experiences in his book ‘The Book of Sir Marco Polo’.
• This book explains the economic history of India. 
8. IBN BATUTA (1333-1347 AD):
Ibn Batuta was A Morrish traveler, he wrote the book ‘Rehla’ (The Travelogue).
In his book he explained the dynasty of Muhammad-bin-Tughlaq and also the economical, social and geographical status of his time.
9. SHIHABUDDIN AL-UMARI (1348 AD): 
• Shihabuddin al-Umari was A traveller from the country Damascus.
• His book is Masalik albsar fi-mamalik al-amsar. He explained Indian History in it.
10. NICOLO CONTI (1420-1421 AD):
Nicolo Conti was A Venetian tourist.
• He visited India at the time of Devaraya I of Vijayanagar empire (Sangam dynasty).
11. ABDUR RAZZAQ (1443-1444 AD): 
• Abdur Razzaq was aforeing envoyer
• He was the Ambassador of Shahrukh of Timurid Dynasty
• A Persian tourist. In India he stayed at the court of the Zamorin at Calicut.
• He give a clear account of the Vijaynagar empire and his kingdom.
• Ambassador of Shahrukh of Timurid Dynasty
• Came during the rule of Devaraya II of Sangam dynasty of Vijayanagar empire.
12. ATHANASIUS NIKITIN (1470-1474 AD): 
• Athanasius Nikitin was a merchant from Russian.
• He explained the living conditions of the Bahmani kingdom which is under Muhammad III (1463-82).
భారత ఉపఖండంలో కుండల తయారీః
భారతీయకళల్లో కుండల పరిశ్రమ పురాతన చరిత్ర కలిగివుంది. ప్రాకృతికమైన, ఐకానిక్ మూలాల కళ ఇది. మెహర్ఘర్ లో తొలి స్థిరనివాసాలనాటి కుండలు ఇండస్ లోయ నాగరికతలో దొరికాయి. ఈ సాంస్కృతిక కళ భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్ లలో విస్తరించింది.ఇప్పటిదాకా కూడా భారతీయ కుండల పరిశ్రమ టెర్రకోటతో సహా మట్టితో చేసినదే.
కొన్నిహిందూ సంప్రదాయాలు మట్టిపాత్రల్లో తినడాన్ని నిరుత్సాహ పరిచాయి. విలాసవంతమైన వాటిమీద మోజు పెంచుకోవడంవల్ల మట్టిపాత్రల పాత్ర తరిగిపోయింది. మట్టి కాగులు, బానలు, పెద్దకుండలు నీటినిలువలకు వాడబడేయి. చిన్న,చిన్న దీపంతలు, గురుగులు, పానపాత్రలు, కొన్ని వాడుకుని పారేసేవి....ఇట్లా ఎన్నో రకాలు. ఈ ఉపఖండంలో టెర్రకోట బొమ్మలు, పాత్రలు, మట్టితో చేసిన అనేకపాత్రలు సాంప్రదాయిక నిర్మాణకళతో మమేకం అయ్యాయి. గుళ్ళు, మసీదులు చెక్కిన ఇటుకలు, టెర్రకోట డిజైన్లతో నిర్మాణమైనాయి కొన్ని. దక్షిణ భారతదేశంలోని గుడుల గోపురాలలో సాధారణంగా రంగులువేసిన టెర్రకోటబొమ్మలతో అలంకరించబడివున్నాయి.
ఈ ఉపఖండంలో కుండల తయారీకి కుంభారులు, కుమ్మరుల జాతి, కులం వారే వృత్తి కళాకారులు.
కుండల చరిత్రః కుండల తయారీని బట్టి ప్రాంతాల వారీగా వేర్వేరు సంస్కృతులకు చెందినవని చెప్తారు.
సోథి-సిస్వాల్ సంస్కృతిః
సింధూ లోయ నాగరికత కన్న ముందటి ,అంటే క్రీ.పూ.4600ల నాటి సంస్కృతి ఇది. గార్గే తేజా ప్రకారం సోథీ సంస్కృతి సిస్వాల్ సంస్కృతి కన్నా ముందరిది. 165ప్రదేశాలలో దొరికిన నివేదికలున్నాయి. సోథీ-సిస్వాల్ ల మధ్య పోలికలు చాలా వున్నాయి.కోట్ డిజి సెరామిక్స్ సంస్కృతి సోథీ-సిస్వాల్ సంస్కృతులకు వాయవ్యంలో, రాజస్థాన్ లో ఆగ్నేయంలో వుంది.
ఆహార్ బాణాస్ సంస్కృతిః
ఈ సంస్కృతి చాల్కోలిథిక్ పురావస్తు సంస్కృతి. రాజస్థాన్ లోని ఆహార్ నది ఒడ్డున ఈ సంస్కృతి వుంది. క్రీ.పూ.3వేల నుంచి 15వందల సం.రాలలో సింధూలోయ నాగరికతకు పొరుగున, సమకాలీనంగా వున్నది. ఆహార్ బాణాస్ ప్రజలు ఆరావళిపర్వతాలశ్రేణి నుంచి రాగి ఖనిజాన్ని సంగ్రహించి గొడ్డండ్లు, పనిముట్లు చేసుకునేవారు.గోధుమ,బార్లీ పంటలు పండించేవారు.
సింధూలోయ నాగరికత సంస్కృతిః
హరప్పాదశ సింధూలోయ నాగరికత సంబంధించి క్రీ.పూ.2500-1900 నాటి పాత్రలభించింది. భారతదేశంలో కొత్తరాతియుగానికన్నా ముందే ఈ కుండల సంస్కృతి వుంది. చేతితో చేసినవి గిన్నెలు, పెద్దకుండలు, పాత్రలు ఎరుపు, నారింజ, గోదుమ, నలుపు, క్రీం వంటి అనేక రంగుల్లో వున్నాయి. అంతేగాక సింధూలోయ నాగరికతలో రెండురకాల కుండలు చేతితో చేసినవి, కుమ్మరిచక్రంమీద చేసినవి వున్నాయి.
రంగపూర్ సంస్కృతిః
సౌరాష్ట్రద్వీపకల్పంలో వానాల దగ్గర ఖంభత్, కఛ్ శాఖల్లో రంగపూర్ సంస్కృతి వుంది. లోథాల్ లో వాయవ్యభాగంలో పెద్దభాగంలో విస్తరించివుంది. ఏఎస్సై వారు 1931,1947,1956లలో ఇక్కడ తవ్వకాలు జరిపారు. నాలుగు కాలాలకు చెందిన మధ్యరాతియుగం, సూక్ష్మరాతియుగం రాతిపనిముట్లు, సింధూలోయ నాగరికతలోని మూడుదశల వస్తువుల్లో కుండలు దొరికాయి.
1. కుండలతో కూడిన సూక్ష్మరాతిపరికరాలు:క్రీ.పూ.3000సం.లు
2. హరప్పా దశః క్రీ.పూ.2000-1500సం.లు
1.పూర్వ హరప్పా: క్రీ.పూ.1500-1100 సం.లు
2.హరప్పా సంధిదశ: క్రీ.పూ.1100-1000 సం.లు
3. గొప్పనైన ఎరుపురంగు కుండల దశ.క్రీ.పూ. 1000-800 సం.లు
ఝూకర్, ఝంగర్ సంస్కృతి:
కంచులోహయుగం తర్వాతిది. సింధ్ ప్రాంతంలో వున్న సంస్కృతి అది. క్రీ.పూ. 2వేలల్లో సింధ్ లోని ఝూకర్ లో బయటపడ్డ ఈ సంస్కృతి హరప్పా సంస్కృతి అనంతరదశ. కొంత పట్టణ నాగరికతాప్రభావమున్నది.దీనిని అనుసరించిందే ఝంగర్ దశ. ఇది పట్టణసంస్కృతి కాదు.క్రీ.పూ. 2వేల నుంచి క్రీ.శ. తొలి వేయిసం.రాలలోనిది.
వేదకాలపు కుండల తయారీ:
వేదకాలపు నాగరికతకు రంగుపూతల కుండల సంస్కృతి, గాంధార సంస్కృతి. సమాధి సంస్కృతులను కొందరు పండితులు వేదకాలపు నాగరికత రూపొందడానికి కారకాలుగా భావించారు. విల్హెం రౌ తైత్తిరీయసంహిత, యజుర్వేదాలలో కుండల తయారీని పరిశీలించాడు. అతని అధ్యయనాలప్రకారం వేదకాలపు కుండలు చేతితో చేసినవి, రంగులు వేయనివి. కుజ్మిన పరిశీలనల ప్రకారం ఆసియామైనర్లో,మధ్యాసియాలో ఆండ్రోనోవో సంస్కృతికి సమానంగా వున్నాయి.
రంగుపూసిన కుండల సంస్కృతి(Ochre Couloured Pottery)
ఇది క్రీ.పూ. కంచుయుగంనాటి గంగా,సింధూమైదానానికి చెందినది. ఈ సంస్కృతి తూర్పు పంజాబు, ఈశాన్య రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లకు విస్తరించింది. ఇది ఇండో ఆర్యన్ లేదా వైదిక సంస్కృతి. రాజస్థాన్ లోని జోధ్ పురాలో సాహిబి నది, దాని ఉపనదులు కృష్ణావతి నది,సోతినది(ఆరావళి పర్వతాలనుంచి పుట్టి ప్రవహించేవి) దక్షిణం నుంచి ఈశాన్యంగా యమున వైపు ప్రవహించిపోతాయి. గంగామైదానాలకు ఈ సంస్కృతి క్రీ.పూ.2వేల సం.లలో చేరింది.ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియావారు రాగిగొడ్డండ్లను, కొన్ని కుండపెంకులను సహరాన్పూర్ తవ్వకాలలో కనుగొన్నారు. ఇక్కడ ఓసీపి సంస్కృతి విస్తారంగా వుంది. హరప్పా నాగరికతవలె ప్రత్యేకం.
రాగినిధుల సంస్కృతి:
క్రీ.పూ.2వేల సం.రాల కిందట వుందని చెప్పే ఈ సంస్కృతి భారతదేశ ఉత్తరభాగంలో గొప్పగానో, తక్కువగానో నిధులుగా దొరికింది. ఈ దోబ్ లో ఓసీపీ హరప్పా పూర్వ దశతో కలిసిన సంస్కృతి. నిధులుగా దొరికిన పనిముట్లు లోహయుగానికి చెందినవి. హర్యానా మ్యూజియంలో ఇవి భద్రపరిచివున్నాయి.
సమాధినిధుల సంస్కృతి:
ఇది ప్రాంతీయ కంచులోహయుగపు రూపం.పంజాబ్ ప్రాంతం, వాయవ్యభారతంలో క్రీ.పూ. 1900-1300 సం.లలో వున్నది. ఝూకర్, రంగ్పూర్ సంస్కృతులతో కలిసి వున్న సంస్కృతి. ఇండో ఆర్యన్ల తొలి వలసల దశలతో సంబంధం కలిగివున్నది.హరప్పాలో ఒక సమాధి బయటపడ్డది. కెనోయర్ ప్రకారం అక్కడ స్థిరపడ్డ ప్రజలలో వచ్చిన పరిణామాన్ని ప్రతిబింబించే సంస్కృతి. తొలిహరప్పా ప్రజల స్థిరజీవనానికి, నగర విధ్వంసం, అగమ్యుల దాడులు, ప్రదేశాల వదిలివేత యిట్లాంటివన్నీ ఈ సంస్కృతిలో అగుపిస్తాయి.
గాంధార సంస్కృతి:
దీనినే స్వాత్ సంస్కృతి అంటారు. క్రీ.పూ. 1500-500 సం.లలో వికసించింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో ఇండో ఆర్యన్ మాట్లాడేవారిలో ఇండో ఆర్యన్ వలసప్రజలలో వున్న సంస్కృతి. వేదకాలపు నాగరికత వికాసానికి ఇది బాగా తోడ్పడ్డది.
నలుపు,ఎరుపు పాత్రల సంస్కృతి:
Black and Red Ware Culture(BRW) ఉత్తర, మధ్య భారత ఉపఖండంలో వైదిక నాగరికతతో కలిసివున్న చివరి కంచులోహయుగానికి, ఇనుపయుగానికి చెందినది. పశ్చిమ గంగామైదానాలలో క్రీ.పూ.1450-1200 సం.ల కాలంలో బూడిదపూత పాత్రల సంస్కృతి(Painted Grey Ware Culture-PGW)మీద వచ్చినటువంటిది. మధ్య,తూర్పు గంగామైదానాలలో ఉ.ప్ర..బీహార్, బెంగాల్ లలో మధ్య భారతంలో బీఆర్డబ్ల్యూ కనిపిస్తుంది. ఈ సంస్కృతి క్రీ.పూ. 500 నుంచి క్రీ.శ. 700సం.ల వరకు కొనసాగింది. ఈ సంస్కృతిని అధిగమించింది Northern Black Polished Ware Culture.బీఆర్డబ్ల్యూ వ్యావసాయిక జీవనంతో ముడివడి వుంది. ఈ కాలంలో శంకులతో, రాగితో, టెర్రకోటలతో నగలు తయారు చేయబడ్డాయి. బీఆర్డబ్ల్యూ హరప్పా కుండలతో కలుస్తుంది. ఈ సంస్కృతి బూడిదరంగుపూత పాత్రలు, ఉత్తర భారతపు నలుపురంగు మెరుగుపాత్రల సంస్కృతుల మీద ప్రభావం చూపింది.
బూడిదరంగుపూత పాత్రలు:(Painted Grey Ware-PGW)
ఈ సంస్కృతి సోంఖ్, మథురలలో క్రీ.పూ. 1000-600 సం.లలో వుంది. పశ్చిమ గంగామైదానంలో ఘాగ్గర్ హక్రా లోయలోని ఇనుపయుగ సంస్కృతితో కలిసివుంది. మధ్యవైదిక, చివరివైదిక దశలకు సమకాలికమైనది. ఈప్రాంతంలో బీఆర్డబ్ల్యూ పిదప వచ్చిన సంస్కృతి.
ఉత్తరభారతపు నలుపుమెరుగు పాత్రలు:(Northern Black Polished Ware-NBP)
ఎన్బీపీ అని పిలువబడే ఈ పాత్రలు భారత ఉపఖండంలోని నగరాల ఇనుపయుగం నాగరికతలోనిది. క్రీ.పూ.700-200సం.ల నాటిది. పీజీడబ్ల్యు సంస్కృతిని, బీఆర్డబ్ల్యూ సంస్కృతిని దాటి క్రీ.పూ.500-300సం.లలో ఉచ్ఛదశలో వున్న చివరి వైదికయుగంలో 16 మహాజనపదాలలో, మౌర్యసామ్రాజ్యపు కాలంలో విలసిల్లింది.
ఎరుపు మెరుగుపాత్రలు:( Red Polished Ware- RPW)
గుజరాతులో విరివిగా,విస్తారంగా కనిపించే సంస్కృతి ఆర్పీడబ్ల్యు. కథియవార్ ప్రాంతంలో వంటపాత్రలు వంటివి క్రీ.పూ.1వ శతాబ్దం నాటివి. భారతదేశంలోని ఇతరప్రదేశాలలో బరోడా, తింబెర్వ, వాద్నగర్, వాలా, సూత్రపద, భండారియాలలో ఎన్నో శతాబ్దాలుగా వాడుకున్న పాత్రల సంస్కృతి. పండితులు ఈ కుండల్ని ఇండో రోమన్ వ్యాపారానికి గుర్తింపు చిహ్నంగా చెప్పారు.
ఈ పాత్రల్ని 1953లో బి.సుబ్బారావు గుర్తించాడు. తాను ‘ ఈ పాత్రలు రోమన్-సేమియన్ పాత్రలవంటి దిగుమతైన పాత్రలతో పోలివున్నావన్నాడు.
ఇందులో రెండురకాలపాత్రలుండేవి. ఒకటి స్థానికమైన వంటపాత్రలవంటివి. రెండవది విదేశీరకం వంటి నీరు చల్లే స్ప్రింక్లర్లు, పొడవైన మెడ పాత్రలు.ఇటువంటిపాత్రలు శ్రీలంకలోని తిస్స మహారామలోని మట్టిపొరల్లో లభించాయి.తొలినాళ్ళ ఆర్పీడబ్ల్యు తరుచుగా ఎన్బీపీడబ్ల్యు పాత్రలతో కలిసి లభించేవి.
మాల్వా సంస్కృతి:
ఇది పురావస్తు రాగియుగపు సంస్కృతి. మహారాష్ట్ర, దక్కన్ ద్వీపకల్పంలో విస్తరించింది. క్రీ.పూ. 1600-1300 సం.లలో వున్న ఈ సంస్కృతి క్రీ.పూ. 2000-1750 సం.లలోనే మొదలైవుంటుందని కార్బన్ డేటింగు వల్ల తెలుస్తున్నది.
జోర్వే సంస్కృతి:
ఇది పురావస్తు చాల్కోలిథిక్ సంస్కృతి. మహారాష్ట్ర, పశ్చిమ భారతం, నుంచి మ.ప్ర.లోని మాల్వా ప్రాంతాన్ని చేరుకున్నది. క్రీ.పూ. 1400 నుంచి 700 సం.ల వరకు వుందని చెప్పవచ్చు.
రంగమహల్ సంస్కృతి:
ఈ సంస్కృతి వైదికయుగానంతరమైనది. 124ప్రదేశాలలో శ్రీగంగానగర్, సూరత్ ఘర్, సికార్, అల్వార్, ఝుంఝున్ జిల్లాలలో ఘాగ్గర్ హక్రా నది వెంట విస్తరించింది. కుషానుల కాలం నుంచి గుప్తులకాలం వరకు వున్నది. స్వీడిష్ పరిశోధకులు రంగమహల్ వద్ద తవ్వకాలు జరిపారు. తొలినాళ్ళ గుప్తుల కాలానికి చెందిన టెర్రకోట వస్తువుల చాలా దొరికాయి. ఇక్కడ అందంగా చిత్రించిన పుష్పాలు, జంతువులు,పక్షుల డిజైన్లతో పాత్రలు లభించాయి.

గుడిమల్లం దేవాలయంపై కొత్తదృష్టి-ఒక ఆలోచనః
గుడిమల్లం :
తిరుపతికి దగ్గరలో వున్న గుడిమల్లం దేవాలయం ప్రాచీనసంస్కృతికి కట్టినగుడి. గుడిమల్లం గుడి నిర్మాణంలో గర్భగుడి గజపృష్టాకారంలో వుంది. అది బౌద్ధచైత్యలక్షణం. ఈ గుడిమీద చేసిన పరిశోధనలు అసంపూర్ణంగానే వుండి పోయాయి. ఈ దేవాలయం ప్రాధాన్యతంతా ఆ లింగంలో వుంది. ఎక్కడాలేనివిధంగా పురుషాంగ రూపంలో చెక్కబడింది. ఈ లింగం చాలా పురాతనమైనదని, క్రీ.పూ.3వ శతాబ్దానికి చెందినదని చెప్పబడుతున్నది. దేవాలయం ప్రాంగణంలో దొరికిన 9వ శతాబ్దపు శాసనాలు అది పరశురామేశ్వరాలయమని పేర్కొన్నాయి. ఈ శాసనాలు గుడినిర్మాతలను పేర్కొనలేదు. కాని, వారీ గుడికి చేసిన వస్తు, ధన, భూమి, గోవుల వంటి కానుకలను గూర్చి తెలియజేస్తున్నాయి. 1973లో చరిత్రకారులు చేపట్టిన తవ్వకాల్లో బయటపడిన పెద్దఇటుకలు (42‘21‘6 సెం.మీ.),నలుపు, ఎరుపురంగు కుండపెంకులు ఆంధ్ర శాతవాహనుల కాలం, క్రీ.శ. 1,2 శతాబ్దాలను సూచిస్తున్నాయి. అందువల్ల కొందరు చరిత్రకారులు ఈ గుడిని శాతవాహన కాలానిదని అంటున్నారు.
చరిత్రకారులు ఈ గుడిపేరును, చరిత్రను అందరు అంగీకరించడం లేదు. అక్కడి శాసనాలు పల్లవ, గాంగపల్లవ, బాణ, చోళ కాలాలకు చెందినవని తెలుస్తున్నది. ఇందులో తొలిశాసనం పల్లవ నందివర్మ(క్రీ.శ.802)కు చెందినది. కాని,ఇక్కడి శాసనాల్లో ఎందులో కూడా గుడిమల్లం అన్న పేరులేదు. గుడిలోని అంతరాళం, ముఖమంటపాల కన్నా గర్భగుడినేల లోతుగా వున్నది. లింగంపై చెక్కివున్న శివరూపం ఆటవిక వేటగానివలె వున్నాడు. శాసనాల్లో ఈ గ్రామం విప్రపీఠంగా చెప్పబడింది. లింగం స్థానికమైన నల్లరాతిలో చెక్కబడింది. అది 5 అ.ల ఎత్తు,1 అ. వ్యాసంతో వుంది. ఆ లింగంపై ఒక అందమైన రెండు చేతుల శివుడు స్థానకభంగిమలో అర్ధశిల్పంగా కనిపిస్తున్నాడు. ఈ శిల్పం అపస్మారపురుషుడు లేదా కుబ్జుని లేదా యక్షుని మీద నిలుచున్నట్లుగా వుంది. ఆ దేవుని కుడిచేతిలో గొర్రెపిల్ల, ఎడమచేతిలో ఒక చిన్న జలపాత్ర వున్నాయి. ఎడమభుజంపై పరశువు(గండ్రగొడ్డలి) వుంది. అతని రెండుచేతులకు ముంజేతులపై సగందాకా కడియా లున్నాయి. శిల్పం తల మీద జటలు జటాభారం వలె చుట్టివున్నాయి. అతని చెవులకు ఎన్నో చెవిపోగులున్నాయి. పైకి కట్టిన ధోవతి ధరించివున్నాడు. అతని నడికట్టు బట్ట మొత్తం లింగాన్ని కప్పినట్టుగా పారదర్శకంగా కనిపిస్తుంది. అతనికి జందెం లేదు. ఈ అలంకరణంతా కురుబసంస్కృతిని పోలివుంది.
ఉజ్జయినిలో దొరికిన రాగినాణాలపై గుడిమల్లంలోని లింగాన్ని పోలిన బొమ్మలున్నాయి. ఆ నాణాలు క్రీ.పూ. 3వ శతాబ్దివి. మధుర మ్యూజియంలో కూడా 1వ శతాబ్దానికి చెందిన శిల్పాల్లో ఒకటి గుడిమల్లం శివలింగాన్ని పోలివుంది. గుడిమల్లంలో తవ్వకాలు జరిపిన కార్తికేయశర్మ ముక్కుకొసపై చూపునిలిపిన దేవునికళ్ళు విరూపాక్షుడు మరియు యోగ దక్షిణామూర్తులను సూచిస్తున్నాయన్నాడు. గొర్రెపిల్లను చేతపట్టుకోవడం భిక్షాటనామూర్తిని సూచిస్తున్నదన్నాడు.
గుడిమల్లం ఎవరి గుడి? పరశురాముని గుడి అంటారు. శైవచిహ్నం లింగానికి, విష్ణ్వావతారాలలో ఒకడైన పరశురామునితో సంబంధమేమిటి. ఏ పురాణాల్లోను, ఆరాధనాపద్ధతుల్లోను లేని ఈ ద్వంద్వమతాల కూర్పేమిటి. ఇది ఏ పురాణగాథల్లో వున్నదో, ఏ జానపదగాథల్లో వున్నదో అన్వేషించాలి.
జనపదుల పురాణాల్లో మల్లన్నదేవుడు శివాంశుడు. శ్రీశైలంలో మల్లికార్జునుడు సంస్కృతీకరించబడిన మల్లన్నే. మహబూబ్ నగర్ జిల్లా, కొల్లాపూర్ మండలం కొల్లాపురిపట్టణం కేంద్రంగా నడిచే కథ మల్లన్న, బీరప్పల గురించిన కథ. మల్లన్న కురుమ, కురుబ, కురుంబ(న్)ల దేవుడు. బీరప్ప వారి కులగురువు. మల్లన్నకు గొర్రెలను వరంగా యిచ్చింది శివుడే. గొడ్డలి ధరించి అడవుల్ని నరికి వ్యవసాయం చేసింది మల్లన్నే. ఆ అడవుల్లో గొర్రెలు కాచుకుంటు కురుమలకు ఆరాధ్యదైవమైనవాడు మల్లన్న. మహారాష్ట్రులకు ఖండోబారాయుడు, కన్నడిగులకు బీరప్ప(వీరప్ప), తమిళులకు మల్లన్నసామి సాక్షాత్తు మల్లన్నే. అతని చేతిలో గొర్రెపిల్ల వుండడం సహజం. అది అతడు గొర్రెలకాపరి అని తెలుపుతుంది. చేత గొడ్డలి అతని ఆయుధం. ఆ జటాఝూటం వంటి జుట్టు శివుని ప్రతిరూపమని చెపుతుంది. అందువల్ల గుడిమల్లం మల్లన్నగుడి కావడానికి అవకాశం ఎక్కువగా వుంది.
ఈ రూపలక్షణాలన్నీ గుడిమల్లంలోని లింగం ముందర విగ్రహానికి వున్నాయి. ఆ విగ్రహం వెనక వున్న లింగం పురుషజననాంగం వలె వుండడం అనాగరిక, ప్రాథమిక శిల్పం తీరు. అమరావతిలోని అమరేశ్వరలింగం కూడా పురుషాంగ రూపంలోనే వున్నదని చెపుతారు. లింగం, విగ్రహాల చుట్టుకట్టిన వేదిక అంచుకు ముందర చక్రం చెక్కబడివుండడం కూడా బౌద్ధధర్మచక్రాన్ని స్మరణకు తెస్తున్నది.
చర్చించండి.





















చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...