కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు, నవపరిశోధకుడు అరవింద్ ఆర్య సందర్శించిన
పాంచాలరాయస్వామి దేవాలయం:
పాంచాలరాయస్వామి దేవాలయం:
వరంగల్ కు తూర్పుగా 10 కి.మీ.ల దూరంలో శాయంపేట హవేలీ అనే గ్రామం వుంది. అక్కడ కాకతీయులు నిర్మించినారని చెప్పబడే ఈ దేవాలయంలో ఒక గర్భగుడి, అంతరాళం, రంగమంటపం వున్నాయి. ఇక్కడి మూలవిరాట్టు ప్రతిమాలక్షణం ప్రకారం కేశవమూర్తి.మూర్తి ముందు కుడిచేతిలో పుష్పం, వెనకచేతిలో శంఖం, వెనక ఎడమచేతిలో చక్రం, ముందు ఎడమచేతిలో గద వున్నాయి. విగ్రహం తలపై కరండమకుటం వుంది. పాదాలకు కడియాలు, మంజీరాలు, కాలివేళ్ళకు మెట్టెలున్నాయి. తల వెనక పెద్ధ ధమ్మిల్లం(సిగ, కేశపాశము) వుంది. మూర్తిలో స్త్రీ లాలిత్యం వుంది. సర్వాలంకార శోభితుడైన ఈ మూర్తినే పాంచాలరాయుడని పిలుస్తున్నారు. ఇక్కడ అర్చామూర్తి వేణుగోపాలస్వామి. దేశంలో కృష్ణునికి దేవాలయాలెన్నో వున్నాయి. పాంచాలరాయుడని పేరున్న కృష్ణుడు మాత్రం ఎక్కడాలేడు. సోదరి పాంచాలికి మానసంరక్షణ చేసినందుకు కృష్ణునికి పాంచాలరాయుడని పేరు కలిగిందంటారు. పాంచాలరాయుని విగ్రహం నల్లరాతిలో చెక్కిన సుందరశిల్పం. విగ్రహ శీర్షం త్రికోణాకారంలో వుంది. ఊర్ధ్వభాగపు ఈ త్రికోణపు శీర్షం అంచున లోపలివైపు దశావతార మకరవ్యాళీ తోరణం స్వామి తలకు ఇరువైపుల చెక్కబడివుంది.
గర్భగుడి ముందరున్న గరుడుని శిల్పంవెనక ఒకటి, రెండోపక్కన మరొకటి చామరగ్రాహిణుల శిల్పాలున్నాయి. చామరగ్రాహిణుల శిల్పాలు నగ్నసౌందర్యంతో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
ఆలయంలోనికి ప్రవేశించేందుకు రాతిద్వారం వుంది. దేవాలయ గోపురం ద్రావిడశైలిలో వుంది. ధ్వజస్తంభం, పక్కన గణపతి విగ్రహం, హనుమంతుని విగ్రహాలున్నాయి. రంగమంటపంలోను, గర్భగుడిలోను కప్పులో పద్మదళాలు చెక్కివున్నాయి. గర్భాలయం ద్వారానికిరువైపుల పెద్ద కలశాలు, ఉత్తరాశి మీద గజలక్ష్మి లలాటబింబంగా వుంది.
ఈ దేవాలయం కాకతీయుల పతనానంతరం ఢిల్లీ పాలకుల చేతిలో ధ్వంసమైందంటారు.క్రీ.శ. 1503లో షితాబుఖాను(సీతాపతిరాజు) పాంచాలరాయస్వామి గుడిని పునరుద్ధరణ చేసినట్లు షితాబుఖాను శాసనం వల్ల తెలుస్తున్నది.
ఈ గుడిగోడలకు వాడిన రాళ్ళలో ఒకదాని మీద కొత్త శాసనం లభించింది. దీని మీదున్న శాసనాన్ని చదవబోయిన ఏఎస్సై సూపరింటెండెంట్ కన్నబాబు ఇందులోనే ‘నందిధాత’ అనే కొత్త తెలుగుసంవత్సరాన్ని కనుక్కున్నానని పత్రికలతో ప్రకటించాడు. తెలుగు సంవత్సరాలలో చేర్చదగిన కొత్త సంవత్సరం కాదది. ఈ 60 సంవత్సరాల కాలచక్రం ఇపుడపుడే మారే అవకాశాలు లేవు. ఈ శాసనం ‘‘ స్వస్తిశ్రీ శుభ శకవర్షంబులు ...........దగు నెంది ధాత’’ అని మొదలవుతున్నది. కన్నబాబు నెంది ధాతనే నంది ధాతగా భావించి వుంటారు. దట్టంగా సున్నం పట్టివున్న ఈ శాసనాన్ని చదువడం కష్టతరంగా వుంది. సున్నం తొలగించే ఏదైనా సాఫ్టు రిమూవర్ వుంటే ఈ పని సులువయ్యేది.

No comments:
Post a Comment