Monday, July 2, 2018


పురావస్తుపరిశీలనను బట్టి పెద్దరాతియుగాన్ని మూడు ముఖ్యమైనదశలుగా విభజించారు.
అవి: 1) ప్రాచీన / పాత ఇనుపయుగం (క్రీ.పూ.1500 సం॥కు అటిటు ` క్రీ.పూ.600 వరకు)
2) మధ్య / నడిమి ఇనుపయుగం (క్రీ.పూ. 700 / 800 నుండి క్రీ.పూ.100 వరకు)
3) చివరి ఇనుపయుగం (క్రీ.పూ.100 నుంచి క్రీ.శ.500 సం॥వరకు)
మొదటి / పాత ఇనుపయుగం: అ) మెరుగు`ఎరుపు మట్టిపాత్ర సంస్కృతి (B&RW)) ఈ సంస్కృతి గంగామైదానం మధ్య దిగువప్రాంతాల్లో వుంది.
ఆ) పూత బూడిదరంగు మట్టిపాత్ర సంస్కృతి (PGW)
దక్షిణభారత పెద్దరాతియుగసంస్కృతి(మధ్య ఇనుపయుగం) ఉత్తరాదిన మెరుగుపెట్టిన నునుపుమట్టిపాత్ర సంస్కృతిని (Northern Black Polished Ware, NBP) కలిగివుంది. ఈ దశలో పట్టణాలు నిర్మాణమయ్యాయి.
చివరి ఇనుపయుగం: ఇనుమువాడకంలో అత్యద్భుతమైన సాంకేతికపరిజ్ఞానం వున్న దశ ఇది.
ప్రాచీనవస్తు సేకర్తలు 16వ శతాబ్దంనుండే ఈ పెదరాతియుగంలోని ప్రాచీనశిలానిర్మాణాలను చూసి ఆశ్చర్యపోయారు. ఈ భారీశిలల భారీకట్టడాలను, సమాధులను కలిపి ఒక్కటిగా పెద్దరాతి(Megalthic)యుగపు సంస్కృతిగా పేరు పెట్టారు.
ఈ మెగాలిథిక్‌(బృహత్సిలాయుగం) అవశేషాలు మనదేశంలోని మహారాష్ట్రలో తూర్పువిదర్భప్రాంతంలోని ఖాందేశ్‌, ‘రంజాలా, టేక్మాడాలో, మధ్యదక్కన్‌లో పూనాదగ్గరి భోనరిలో కేంద్రీకృతమైనట్టున్నవి. ఇంకా ఖైవార్‌, దొంగర్‌గాం, చాక్‌ విఠ్ఠల్‌వాడ, కుకుత్చింద, మహుర్జరి, జూనాపానిలో పెద్దసంఖ్యలో బంతిరాళ్ళసమాధులు (Stone circles) కనుగొనబడ్డాయి. జూనాపాని దక్షిణభారతదేశపు పెద్దరాతియుగపుప్రాంతానికి ఉత్తరసరిహద్దు గ్రామం. మధ్యప్రదేశ్‌ లోని దుర్గజిల్లా ధనోరలో 500కు మించిన సమాధుల సముదాయం కనిపించింది. ఈ సమాధులకు తెలంగాణాలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమ్రాబాద్‌సమాధులకు పోలికలున్నాయి.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పెద్దరాతియుగపు సమాధులుకొల్లలుగా వున్నాయి. ఈ.హెచ్‌.హంట్‌ అప్పటి నిజాంస్టేటులో 10లక్షల సమాధులుండవచ్చునంటాడు. ఇక్కడి ప్రతి రెండవగ్రామంలో పెదరాతియుగపు సమాధులు తప్పకుండా వుంటాయని అభిప్రాయపడ్డాడాయన. అంటే అప్పుడు తెలంగాణాలో ఎంత విస్తృతంగా చారిత్రకపూర్వప్రజలు నివసిస్తుండే వారోననిపిస్తుంది. ఆదిమమానవులీ నేలపై తర, తరాల జీవనసంస్కృతులను నెలకొలిపివుంటారు. అందుకే లక్షలాదియేండ్లుగా మానవపరిణామప్రగతికి వేదికైంది తెలంగాణా. అత్తిరాంపాక్కం వంటి పూర్వచారిత్రకప్రదేశాలతో, దక్షిణభారతదేశంలోని చరిత్రపూర్వయుగాలనాటి తావుల తేదీలను క్రాస్‌డేటింగ్‌ చేస్తే తెలంగాణా చారిత్రకకాలాలు  కూడా మారిపోతాయి. తెలంగాణాలో ప్రాక్చరిత్ర వయస్సు ఇంకా లక్షయేండ్ల ముందుకుపోతుంది.
 బృహత్సిలాయుగపు సమాధుల నిర్మాణాల విభజనలు:
జి.డేనియల్‌ (1972)`(పశ్చిమ ఐరోపాలో) 1.నిలువురాళ్ళు (Menhirs) 2.నిలువురాళ్ళ సమూహం (Standing Stone Alignments), 3.బంతిరాళ్ళు(Stone Circle), 4.గదులసమాధులు (Chambered Tombs - Walled and roofed with Megaliths)
మిడోస్‌టేలర్‌(1862): దక్షిణభారతసమాధులను 1) క్రోమ్‌లెక్స్‌: ఒకపక్క పెద్దరాతిబండను నిలపడం, 2) కిస్టవేయిన్స్‌: అన్నివైపులమూసి నిలిపిన పెద్దరాతిబండలు 3) కైరన్లు: ఒకటి, రెండు లేదా మూడువరుసల బంతిరాళ్ళతో కూడిన సమాధులు.
కృష్ణస్వామి (1949): తమిళనాడులోని చెంగల్పట్టుజిల్లాలో అగుపించిన సమాధులను రెండురకాలుగా విభజించాడు. 1) డాల్మనాయిడ్‌సిస్ట్‌, 2) కైరన్‌ వృత్తం
తానే కొచ్చిన్‌లోని ఇటువంటి సమాధుల్ని
1) డాల్మనాయిడ్‌ సిస్ట్‌ (Dolmenoid cist)
2) కుండ సమాధి (Urn burial)
3) గొడుగురాయి లేదా కూడకల్లు’ (Umbrella burial): అర్థ గోళాకారంగా చెక్కిన పెద్దరాయి
4) టోపికల్లు (Hat burial) : నాుగు రాతిపకను చతురస్రాకారంగా కుపుతు వేసిన పెద్దరాతి పక
5) నిలువురాళ్ళు (Menhirs)
6) తొలిచిన రాతిగుహసమాధులు: (Rock cut burials) రాతిమట్టిలో చేసిన భూగర్భసమాధులుగా విభజించాడు.
గురురాజరావు (1972): ఈ సమాధులను కిందివిధంగా విభజించాడు:
1) రాతిలో తొలిచిన గుహసమాధులు, 2) పడిగెరాళ్ళు (Hood stones) 3) గుంటసమాధులు (pot burials),
 4) నిలువురాళ్ళు (Menhirs) 5) డాల్మనాయిడ్‌ సిస్ట్‌, 6) కైరన్‌ వృత్తాలు, 7) బంతిరాళ్ళు, 8) గుంత(pit) వున్న రాళ్ళకుప్ప
డా॥ పి.సి.వెంకట సుబ్బయ్య (2010): పెద్దరాతియుగం సమాధులను కిందివిధంగా వర్గీకరించాడు.
1. శవపేటికలు (Cists) (పెట్టె సమాధులు): మూతబండలేని, దీర్ఘచతురస్రాకారంలో నిలిపిన రాతిపలక సమాధి.
2.బంతిరాళ్ళ మధ్య శవపేటిక: (Cist Circle)`పూర్తిగా భూమిలో వుండేది.
3. రాళ్ళగుట్ట లేదా బంతిరాళ్ళసమాధి (కుప్పసమాధి): జaఱతీఅం
4. కుప్పసమాధి చుట్టు బంతిరాళ్ళు: (Cairn circles) .
5. శవపేటికలు (Dolmens): 4 నిలువురాళ్ళపైన కప్పురాయి వుండే సమాధి (గూడుసమాధి)`కంత (Hole) వుంటుంది/వుండదు)
6. బంతిరాళ్ళు (stone circles)
7. రాతిఅర్రలు (సగం భూమిలో వుండి`ఒక వైపు తెరుచుకొని పైబండ వుంటుంది.(Dolmenoid cists)
8. నిలువురాళ్ళు / స్మారక శిలలు (Menhirs)
9. క్రోమ్‌లెక్స్‌ : ఒక పక్క తెరిచివుండే పెద్ద, పెద్ద బండరాళ్ళతో కట్టిన చరిత్రపూర్వయుగ సమాధి.
10. మానవాకారపు సమాధి (Anthromorphic burial)
11. గర్భస్థసమాధి(Rock cut chamber) భూగర్భ రాతిగుహ సమాధి.
12. గుంతసమాధి (pit burial)
దక్షిణభారతదేశంలోని పెద్దరాతియుగపుదశలు 3రకాల(పరివర్తనలు)గా కనిపిస్తాయి.
1. శవాలను (యథాతథంగా)సమాధుల్లో పెట్టడం
2. శవాలను బహిరంగంగాపడేసి, జంతువులు, రాబందులు తినగా మిగిలిన ఎముకల్ని ఏరి, సమాధిగదుల్లో పెట్టడం.
3. దహనంచేసిన మృతదేహాల ఎముకల్ని సేకరించి సమాధుల్లో పెట్టడం.
గుంటసమాధులు (pit burials), కుప్పసమాధులు (cairns) మిగిలిన సమాధులరకాల్లో మొదటివి. Cists, Dolmonoids తర్వాతవి.(కృష్ణశాస్త్రి ` 2003).

No comments:

Post a Comment

చరిత్రలో సమ్మక్క

చరిత్రలో సమ్మక్కః                                                 ----------- శ్రీరామోజు హరగోపాల్ ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం...