చతుఃకూట దేవాలయాల జలాల్ పూర్:
(12.03.18)
సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మండలంలోని గ్రామం జలాల్ పురం.ఈ వూరికి వాయవ్యాన చిన్నరాతిబోడు మీద మూడు శివాలయ సమూహాలున్నాయి.
వీటిలో తూర్పున వున్న గుళ్ళను బోడగుళ్ళంటారు. పిలుపుకు తగ్గట్టే ఈ గుళ్ళు నిరాలంకారంగా, శిల్పరహితంగా వున్నాయి. గుళ్ళల్లో ఏ విగ్రహాలు లేవు. తూర్పున వున్న ఉపాలయంలో కాకతీయులనాటి పానవట్టం ఒకటి వుంది. పడమటివైపు ఉపాలయానికొక్కదానికే ద్వారబంధాలకు కలశాలు చెక్కివున్నాయి.
బోడగుళ్ళకు వెనుకగా ఒకే రీతి శిల్ప, నిర్మాణాలతో వున్న రెండు ఆలయ సమూహాలున్నాయి. తూర్పున వున్న దేవాలయసమూహంలో గుళ్ళన్నీ నాలుగుదిశలకు మధ్యలో నాలుగు అభిముఖ ద్వారాలతో కట్టబడి వున్నాయి. ప్రతిమూల నుండి గుళ్ళలోకి ప్రవేశించేందుకు ఖాళీలున్నాయి. అన్ని దేవాలయాలకు గజలక్ష్ములు లలాటబింబాలుగా చెక్కబడ్డాయి. ద్వారబంధాలకు ఇరువైపుల కాకతీయశైలి కలశాలున్నాయి.ఒక్క ఉపాలయానికి మాత్రం చామరధారులున్నారు.
రెండు దేవాలయసమూహాల్లో రెండు ఎత్తైన నంది విగ్రహాలు శిథిలస్థితిలో వున్నాయి.నిధులమాఫియా రెండు నందులను విరుగగొట్టింది.గుళ్ళల్లోని విగ్రహాలు లేవు. కొన్నింటిలో మాత్రమే పానవట్టాలమీద శివలింగాలున్నాయి.
సాధారణంగా గుడులు ఒక గర్భగుడి, అంతరాళంతో వుంటాయి. కొన్నిచోట్ల రెండు ఆలయాలు ఎదురెదురుగానో, పక్కగానో వుంటాయి, ఒకే కప్పువుంటుంది. ఇవి ద్వైకూటాలని పిలువబడుతాయి. ఒకే కప్పు కింద రెండు, మూడు, నాలుగు, ఐదు గుడులుంటే వరుసగా వాటిని ద్వైకూట, త్రికూట, చతుఃకూట, పంచకూట ఆలయాలంటారు. ఈ గుళ్ళల్లో ప్రధానాలయం ఒకటి, మిగిలినవి ఉపాలయాలు. ఫ్రధాన దైవం ఒకరుండగా అనుచరదైవాలుగా, వేర్వేరు కూటాలలో వేర్వేరు దేవుళ్ళను ప్రతిష్టిస్తుంటారు.
ఇక్కడ మాత్రం అన్నీ శివాలయాలే. కాని, ఒక్క ఉపాలయం విమానం మీద నాలుగువైపుల సూర్యశిల్పాలున్నాయి. ఉపాలయంలో అధిష్టానపీఠం వుంది. అందువల్ల అదొకటి సూర్యుని గుడి కావచ్చు.
ఈ గుళ్ళను స్థానికులు ఏడుగుళ్ళని పిలుస్తారు కాని, వున్నవి ఎనిమిది గుళ్ళు.
జలాల్ పూర్ కు సంబంధించిన తొలిశాసనం కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని పాలనాకాలంలో క్రీ.శ.1202 మార్చి10న (శా.శ.1124 దుందుభి చైత్రపౌర్ణిమ,ఆదివారం రోజు) వేయబడింది.ఈ శాసనంలో 1,2 వైపుల ఒకశాసనం,3,4వైపుల అనుబంధశాసనం వున్నాయి. రెండు కూడా చతుర్థకులశేఖరుడైన చెరకు బొల్ల వేయించినవే. ఈ శాసనాలలో చెరకువంశం గురించి వివరాలున్నాయి. చెరకు వంశస్థాపకుడు కాట(1లేదా2వ) భీమచోడుని వద్ద చెరకు-12 భూభాగం పాలనాధికారాన్ని పొందాడు.
కాట,మల్లాంబికలకు కేత,సూర,బొల్లలు జన్మించారు. కేత,తిక్కాంబికలకు కాట,మార,ఎర్ర,ఎర్రలు పుట్టారు.వీరు రుద్రదేవునికి చోడోదయం గెలవడంలో సాయపడ్డారు. కాకతిరుద్రదేవుడు వారికి గుండియపూండి, రాపుండి, గొట్టిపసుందల, తొర్రూరు, రూపురాలను యిచ్చాడు.
కాట,కుప్పాంబికలకు కాట,మార,బొల్లలు పుట్టారు. గుండియపూండికి కాట,....పర్రుకు మార, పానగల్లు,ఉప్పునూతలలకు బొల్ల పాలకులయ్యారు. రాంపూడిలో బొల్ల కేతేశ్వర,కాటేశ్వర,మారేశ్వర,సూర్య, గణేశ, దుర్గ దేవాలయాలను కట్టించి, మర్రికుంట వెనక భూములను దానం చేసాడు.
మొదటిశాసనంలో బొల్లచమూపతిగా సంబోధించబడ్డ బొల్ల, అనుబంధశాసనంలో జమ్మునూరి పురవరేశ్వరుడు బొల్లిరెడ్డిగా పిలువబడ్డాడు.ఈ శాసనం కూడా క్రీ.శ.1202 మార్చి10ననే వేయబడ్డది.
బొల్ల జమ్ములూరిలో కట్టించిన భీమేశ్వరదేవరకు గనిమెట్ట తూర్పున పుట్టి పండే పొలం 1, గనిమెట్టవెనక మర్తురు పొలం 1 దానం చేసాడు.ఎరగేశ్వర దేవరకు గనిమెట్టకుంట దగ్గర మర్తురు1 వెలిపొలము, పా 10 మర్రికుంట వెనక, దేవనపూచిగారి ఉపాధ్యాయవృత్తికి మర్తురు 1, సూత్రధారి కాసమల్లోజుకు మర్తురు 1, కొలిపాక సోమనాథదేవునికి, మాచమసెట్టి మల్లికార్జునికి అడ్డ 1, బొల్లేశ్వరదేవరకు అడ్డ 1, కేతేశ్వరదేవరకు అడ్డ1, మారేశ్వరదేవరకు, పట్టిసముద్రాన మర్తురు 1, ముప్పేశ్వరదేవరకు చెరువుచుట్టు మర్తురు 1 దానం చేసినట్టు శాసనంలో వుంది.
చెరకు వంశానికి చెందిన ఇమ్మడి విశ్వనాథ ఈ దేవాలయానికి భూదానం చేసిన దానశాసనం నల్లగొండ జిల్లా శాసనపంపుటిలో 199వ పేజీలో అచ్చయివుంది.
ఈ శాసనాన్ని కాకతీయసామ్రాజ్య పాలకుడు గణపతిదేవుని కాలంలో సామంతరాజు జమ్ములూరి పురవరేశ్వరుడు ఇమ్మడి విశ్వనాథుడు క్రీ.శ. 1253లో ఏప్రిల్ నాలుగున వేయించాడు.ఈ శాసనంలో అతని వంశం వివరాలు చెప్పబడ్డాయి. ఈయన తన తల్లిదండ్రులు, సోదరుని పేర బొల్లేశ్వర, మల్లేశ్వర, గణపేశ్వర దేవాలయాలను కట్టించాడు. మామిడి చెరువు, నల్లకుంటల వెనక రెండు మర్తురుల భూమిని దేవభోగాలకింద దానం చేసాడు.గనికట్ట కింద ఖండుక(పుట్టి ధాన్యం పండించే) భూమినిచ్చాడని శాసనంలో వుంది.
మొదటి,రెండవ శాసనాలలో చెరకు వంశం వివరాలుః

కాట-కామాంబిక
I________________________________________
కేత-తిక్కాంబిక సూర, బొల్ల
I
________________________________________
కాట-కుప్పాంబిక, మార, ఎర్ర, ఎర్ర

కాట, మార, బొల్ల-మల్లాంబిక

గణపతి, విశ్వనాథ, కేత, ఇమ్మడివిశ్వనాథ

No comments:
Post a Comment