తుర్కపల్లి యాదిః
తుర్కపల్లికోటః
మన్నెవా(ర్)రి తుర్కపల్లి ఒకప్పటి సంస్థానం అయివుంటుంది. నైజాంపరిపాలనాకాలంలో తమసైన్యంలో పనిచేసిన ‘మన్నెవార్’లకు నిజాంప్రభువులు బిరుదులు, భూములు, కొన్నిచోట్ల పాలనాధికారాలిచ్చినట్లు చరిత్రలో తెలుస్తున్నది. అటు సంస్థానం నారాయణపూర్ సంస్థానానికి, ఇటు రాజాపేట సంస్థానానికి రాజులైన వారిబిరుదుల్లో సర్దార్ మన్నెవార్ అనివుండడం ఇదే సూచిస్తున్నది. యాదాద్రి జిల్లాలోని మండలకేంద్రం తుర్కపల్లిలోని కోట మట్టికోటే. దాదాపు 4ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట విస్తరించివుంది. ఇప్పుడా ప్రాంతంలో ఆనవాళ్ళే మిగిలివున్నాయి. లోపలికోటలో నాలుగుబురుజులు ఇంకా నిలిచేవున్నాయి. మూడువైపుల మిగిలినగోడలు 4మీటర్ల ఎత్తున్నాయి. కోటగోడల మధ్యన రాజభవనం పూర్తిగా శిథిలమయివుంది. మట్టిగోడలకు సున్నండంగుపూతవుంది. అక్కడక్కడ సున్నండంగుతో వేసిన కప్పు ఆనవాళ్ళు కనపడుతున్నాయి. బయటికోటకు గుర్తులుగా పెద్ద,పెద్ద బురుజుమట్టిదిబ్బలు మిగిలివున్నాయి.

తుర్కపల్లి గుళ్ళుః
రాములగుట్టః
తుర్కపల్లికి ఉత్తరాన చిన్నరాతిబోడుమీద రాతిగుండ్లకు చెక్కిన హనుమాండ్లు,గరుత్మంతులు మరియు చిన్నగుడిలో రాతిగుండుకే చెక్కిన 5ఉల్బణశిల్పాలను శ్రీరాముడు,సీత,ఛత్రంతో భరతుడు,నమస్కారంతో లక్ష్మణుడు, చామరంతో శతృఘ్నుడులుగా ఆరాధిస్తున్నారు.రాముటగుట్ట రాముడు,సీతాదుల కిరీటాలు స్తూపాకారంగా వుంటాయి.15,16 శతాబ్దాల నాటి శిల్పశైలిని పోలివున్నాయి.రాముని చేతిలో కోదండం వుంటే గుర్తుపట్టడానికి బాగుండేదేమో.రాముడు దక్షిణలంబపాదంతో కూర్చునివుంటే,సీత సుఖాసనంలో వుంది.రామసోదరులు నిలుచునివున్నారు.ఈ గుడికి దగ్గరలో బూరుగుకుంట అని చిన్న జలాశయం వుంది.స్థానికప్రజలు ఆ నీటిగుంటలో భృగుమహర్షి స్నానమాడి రాములవారిని సేవించేవాడని చెప్పుకుంటారు.ఈ పౌరాణిక కైఫీయత్తుకు ఆధారం మౌఖికకథనమే.
ఈ 5శిల్పాలప్యానెల్ శ్రీరామపట్టాభిషేకశిల్పమని పూజించే తుర్కపల్లిగ్రామప్రజలు ప్రతి శ్రీరామనవమిరోజు పెద్దగా ఉత్సవాలు చేయడం వూరి ఆనవాయితీ.గ్రామంలోని అందరు అందరియిండ్లను పుదిచ్చుకుని, చుట్టాలను పిలుచుకుని పండుగచేసుకుంటారు.మరునాడు అందరు కలిసి వనభోజనాలకు పోతారు.3డో రోజు రాములవారి వూరేగింపు.అందరు నిష్టగా వుంటారట.గ్రామంలోని ప్రజలంతా రామభక్తులే అన్నట్టుంది.వూరిలోని ముదిరాజులైతే రాములగుట్ట రాములవారికి మొక్కనిదే,నైవేద్యం పెట్టనిదే ఏ పనిమొదలుపెట్టరట.
శివునిగుట్టః
రాములగుట్టకు ఈశాన్యంలో చిన్నరాతిగుట్టమీద పురాతన శివాలయమున్నది.గుడిముందర గ్రానైట్ తో చెక్కిన నల్లనినంది వుంది.శివాలయం గర్భగుడిలో లింగం లేదు.అంతరాళపు రెండుగోడలు మిగిలివున్నాయి.గుడివిమానం ఫంసానపద్ధతిలో సప్తసోపానాలతో వుంది.గుడినిర్మాణానికి వాడిన ఇటుకలు పెద్దసైజువి.సున్నండంగుపూతతో గోడలు.గర్భగుడికి కప్పుకు కోణాకారంలో పేర్చిన రాతిబండల వరుసలు. కాకతీయులకు పూర్వశైలి దేవాలయం.
కొత్తగుడిః
గ్రామంలో కొత్తగా శివునిగుడి నిర్మాణం చేసారు.గుడి ప్రాంగణంలో పాతవి గుండ్రనిపానవట్టం,దానిమీద బాణలింగం, విరిగిపోయిన నల్లరాతి చామరగ్రాహి స్త్రీశిల్పం వున్నాయి.ఉత్తరాన చావిడిలో ఆంజనేయునివిగ్రహం,ముందర అడుగున్నర ఎత్తులో వినాయకవిగ్రహం.ఇవి కూడా ఏ చాళుక్యులకాలంనాటివో.
శివాలయం:
వూరిలో శివాలయంగా పిలువబడే పాతది,శిథిలమూ అయిన గుడివుంది.గుడికి గర్భగుడి,అంతరాళాలు మిగిలివున్నాయి.అంతరాళపు ద్వారానికి 6రేకుల పువ్వు లలాటబింబంగా చెక్కివుంది.ఇలాంటి లలాటబింబాల్ని ఆలేరుదగ్గరలోని మందనపల్లిగుడి ద్వారానికి,వర్గల్ లో పాతగుళ్ళు సముదాయంలోని గుడులద్వారాలకు చూసాం.గర్భగుడికి శైవద్వారపాలకులున్నారు.లలాటబింబంగా మాత్రం అరుదుగా కనిపించే పార్వతి ఇక్కడ ద్వారానికి లలాటబింబంగా చెక్కబడివుంది.అంటే ఈ గుడి పార్వతీ లేదా ఉమాసహిత దక్షిణామూర్తితో కూడిన శివాలయమైవుండవచ్చు.గర్భగుడిలో 3సర్పాలున్న శిల్పఫలకమొకటి నిలబెట్టివుంది. అది ఆ గుడిప్రాంగణంలోనిది అక్కడికి చేర్చబడివుంటుంది.
వీరగల్లులుః
గ్రామానికి తూర్పున 4రాతిస్తంభాలు,రాతిబండకప్పుతో మధ్యలో నల్లనిగుండు వుంది పోచమ్మగుడి ముందు పోతరాజువంటిది.దానికవతల నాలుగైదు వీరగల్లులు వున్నాయి.అందులో ఒక వీరగల్లు వేటదృశ్యానిది.వీరుడు అడవిపందిని ఈటెతో పొడిచి చంపుతున్నాడు.వేటకుక్కసాయపడ్తున్నది.రెండో వీరగల్లులో ఆవుదూడ,దానిముందు సర్పం.దానిని కాపాడ్డానికి ప్రాణమిచ్చిన ధనుష్ధారి వీరునిదే కావచ్చు ఆ శిల్పం.ఇట్లాంటి వీరగల్లు మరెక్కడా చూడలేదు.దానికవతల వీరుల తలలు మాత్రమే కనిపిస్తున్న మరిరెండు వీరగల్లులు వున్నాయి.వీటిపక్కన కూలిపోయిన అమ్మదేవత గూడుగుడి వుంది.
మన్నెవారి తుర్కపల్లి యాది2:
మహారాష్ట్రరాష్ట్రంలో చందాజిల్లాలోని ఒకభాగానికి చెందిన తెలుగుమాట్లాడే ఒక చిన్నతెగవారు ‘మన్నెవార్లు’.మన్నెం అంటే అడివి.మన్నెవార్లంటే అడివిప్రజలు.1911లో వీండ్లు 1600లని లెక్కించబడ్డారు.వీరికి ఆశ్రయం అప్పటి హైదరాబాద్ రాజ్యం.అక్కడవారి సంఖ్య 22,000లు.ఈ ప్రాంతంలో ఒకప్పుడు వీరిదే ఆధిపత్యం.కోయగొండులలో వీరిది తక్కువగా చూడబడే ఒకశాఖ.సామాన్యంగా వీరిని మన్నెవార్ కోయలు అని పిలుస్తుంటారు.మన్నెవారిదొరలు కోయదొరలను వ్యతిరేకించేవారు.కోయదొరలు రాజ్ గోండులతోను, మన్నెవార్ కోయలు ధుర్ లేదా ధూళి గోండులతో సంబంధాలను కలిగివుండేవారు.ఈ జాతి మూడు గుంపులుగా విభజితమైంది. నాలుగువేల్పులు నలుగురుదేవుళ్ళను పూజించే గోండులు,అయిదువేల్పులు అయిదుగురిని పూజించే గోండులు, ఏనువేల్పులు ఆరుగురిని పూజించే గోండులు.పెండ్లిండ్లు కూడా ఆయా గుంపులమధ్యనే జరుగుతాయి.( (THE TRIBES AND CASTES OF THE CENTRAL PROVINCES OF INDIA-by R. V. RUSSELL)

Mannedora(lord of the hills)- A title assumed by kondadoras.Manne sultan is a Titlr of the Maharaja of Travancore and the Raja Vizianagaram.The Konda Doras also style themselves Mannelu, or those of the hills.(Castes-Tribes- Southren India-4--- Edgar Thurston)
1663: A Mannewar forest tribal group was called an ancient group of India, with a history of 700 yrs. They belonged to the Dravidian family, and were the most important of the Non-Aryan or forest tribes. Generally Mannewar tribal people lived in forest areas for a long time. That's how the tribal community became isolated from the outside world. Their main problems were poverty, illiteracy, exploitation by forest contractors and money lenders etc. They couldn't solve their problems. Being an isolated group and the lowest caste which shifted from the Koyas, their earlier history was not notified by the literate groups. But the history and the life style of the Mannewar tribal community had been linked with the Nizam's Government and the Royal Maratha empires, i.e. in the 16th century. In 1663, Mannewar people were specially appreciated in the novel, Raja Shiv Chatrapati, in the chapter called ‘Mudhol and Kurhad’ (Ref p.n. 523 to 533), where it is mentioned that, after the death of king. Raje Slhahaji. (Nov.1663) King Shiv Chatrapati took responsibility of his kingdom, made all out efforts to unite the warriors of the different castes together, and planned to attack Viyapur. To win this war, military power and clever horse rider warriors were recruited from Mannewar, Bhil. Gond, Koli etc. (Oct 1664). In the war of October, 1664, a platoon of the Marathas, Mannewar. Bhil and Gond defeated Khan and his military power. Thus, Mannewar has an ancient heritage which cannot be denied.
1818: As per the history of Tribal Mannewar, researched by K P Kumaran and notified in his book, 'Migration Settlement and Ethnic Association' (p.n.37—48), during the second quarter of the eighteenth century, the 11nd Baji Rao Peshawa's rule was at us nadir. He shifted his headquarters to Pune from 1796 to 1818. He observed that many artisans, traders, masons, priests, soldiers etc., and many Telugu speaking immigrants (including the Tribal Mannewars), were specially invited by the Peshawa to work in his various military departments, and for the construction of the city capital of Pune. (The Gazetteer of Bombay Presidency (1882. pp 1 19-120),Vol.X1II). 1891: As per Census of India, 1891. vol. XXIII, part II (Chapters VII to Xii) written by Mirza Mehdy Khan, Provincial Superintendent of Census Operations, - (90%) ninety per cent of the caste Mannewar are found in the district of Elgandal, formerly the capital of Telangana are the time of the Nizam's Govt. At that time, this area came up under the Central Provision controlled by Indian British Government.
(Historical Background of Mannewar Samaj)

తుర్కపల్లిని స్థానికనాయకులు పాలించారన్నది జిల్లా గజెట్ లో వుంది.కాని,వారి వివరాలను ఇంకా అన్వేషించాల్సివుంది.కాని,వారు నిర్మించిన కోట,ఇతర నిర్మాణాలున్నాయి.
తుర్కపల్లిలోని ఒక అద్భుతమైన నిర్మాణం మెట్లబాయి.‘లంబడోళ్ళ బాయి’గా పిలువబడే ఈబాయి వూరికి నైరుతిలో భువనగిరిరోడ్డుకు దగ్గరలో పడమటివైపున వుంది.ఈ బాయిని ఒకసారే కట్టినట్లుగా లేదు.మొదట ఈ బాయిని తవ్వించాక తర్వాత దానిచుట్టు ప్రాకారం చాలా అందంగా కట్టారు.30 నుండి 40 అడుగులలోతున్న బాయి గట్టిమొరం తావులో తవ్వించారు.దీర్ఘచతురస్రాకారంలో తవ్విన ఈ బాయితిన్నెలమీద రాతిస్తంభాలతో కట్టిన వరండాలు,పైన పరిచిన రాతిదూలాలు,వాటిమీద శిల్పాలు ఎంతో అందంగా వున్నాయి. చారిత్రాత్మకమైనవి.బావిలోనికి దిగడానికి 3వైపులనుండి దిగుడుమెట్లు ఏర్పరిచారు.ఉత్తరంమెట్లు మొదటి అంతస్తుకు, దక్షిణంమెట్లు బాయి అంచుకు,తూర్పుమెట్లు మొత్తం బావిలోనికి కట్టబడివున్నాయి.
ఈ ప్రాంతంలో ఎక్కడా కనపడని ‘గజవినాయకు’ని శిల్పం బావికి పడమటివైపు అంచున రాతిగుండుకు చెక్కివుంది.ఈ ప్రాంతమంతటా బాదామిచాళుక్యుల నుండి కాకతీయులు ఆలయాలలో ఎక్కడైనా గుళ్ళల్లో గర్భగుడుల ద్వారాలపై లలాటబింబాలుగా ‘గజలక్ష్ముల’నే చెక్కారు.ఇక్కడ గుళ్ళల్లో కనిపించే వినాయకులలో గజాలు ఆరాధిస్తున్న వినాయకుణ్ణైతే ఈ మెట్లబాయిలోనే చూస్తాం.ఉత్తరంవైపు బావి అంచున చేపలను చెక్కారు.అదే వైపు పైనున్ను రాతిదూలం మీద ‘మత్స్యమిథునం’ చెక్కివుంది.తూర్పునుండి లోపలికి దిగే మెట్లు పూర్తయేచోట రాతి ఆర్చి వుంది.దానిమీదున్న చిహ్నం ‘నైజాం రాజ్యలాంఛనం’ రూమీటోపివలె వుంది.మన్నెవారు నిజాంకు విధేయులైన పాలకులు కదా.అందుకే వారు ఆ చిహ్నాన్ని బావిలోని రెండు ఆర్చిలమీద చెక్కించారు.ఇది అరుదైనదే.
బావిఅంచులమీద కట్టిన ఈ స్తంభాలపందిరి రాతిదూలాలమీద ఏనుగులు,గుర్రాలు,సింహాలు,ఆవులు చాలాచోట్ల చెక్కబడివున్నాయి.తూర్పునుండి లోపలికి దిగుతున్నపుడు కూడా దక్షిణం రాతిగోడలమీద ఆవు-దూడల వరుస వెనక కాపరి ఉల్బణశిల్పాలు చాలా అందంగా వున్నాయి.
మధ్య రాతిదూలాల మీద తూర్పుముఖంగా చెక్కివున్న తిరునామాలు,ఇరువైపుల చక్ర,శంఖాలు వాటికిరువైపుల కుండలు,దక్షిణం వైపు హనుమంతుడు,పూజారి,ఉత్తరంవైపు గరుత్మంతుడు చెక్కబడివున్నారు.ఇంకో రాతిదూలంమీద రెండు కోతులు,రెండు హంసలు శిల్పించబడివున్నాయి.మరో రాతిదూలంమీద శృంగార శిల్పాలున్నాయి.చల్లచేసే గొల్లభామమీద చేతులేసిన పురుషుడు(కృష్ణమూర్తేమో),అతనివెనక ఒక భామ, దాని వెనక ప్రత్యేకంగా శృంగారభంగిమ,ఆవలివైపు పురుషులసందడి శిల్పాలు.
ఈ బావిలోని శిల్పాలు రాష్ట్రకూటులకాలంనాటివేమోనని సందేహం.మిగతావన్నీ 3వందల సంవత్సరాలలోపలివే.నైజాం పాలనాకాలంవే.ఏ నిజాం నాటివన్నదే తెలియాలి.

No comments:
Post a Comment